English | Telugu

"నా వెనుక నిలిచింది నా తండ్రి ప్రేమ‌!" వైర‌ల్ అయిన‌ దీప్తి ఎమోష‌న‌ల్ పోస్ట్‌!!

ఆరు రోజుల క్రితం, కొత్త సంవ‌త్స‌రారంభం సంద‌ర్భంగా ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌తో త‌న అనుబంధాన్ని తుంచేసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించి అంద‌రికీ షాకిచ్చింది దీప్తి సునయ‌న‌. త‌మ ఇద్ద‌రివీ వేర్వేరు దారుల‌ని గుర్తించ‌డంతో ఐదు సంవ‌త్స‌రాల త‌మ బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నామ‌ని ఆమె చెప్పింది. దీంతో బిగ్ బాస్ 5 హౌస్‌లో సిరి హ‌న్మంత్‌తో ష‌ణ్ణు క్లోజ్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం, హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత అత‌ను త‌న‌ను క‌ల‌వ‌డానికి రాక‌పోవ‌డం దీప్తిని తీవ్రంగా బాధించింద‌నీ, అత‌ని ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగానే ఆమె ఈ డెసిష‌న్ తీసుకుందంటూ సోష‌ల్ మీడియాలో విరివిగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

Also read:ష‌న్ను బండారం బ‌య‌ట‌పెట్టిన కాజ‌ల్‌

ఆ త‌ర్వాత ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన దీప్తి.. బ్రేకప్‌ గురించి స్పందిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. బ్రేకప్‌ గురించి ఓ నెటిజన్‌ దీప్తిని ప్రశ్నించగా.. జీవితంలో ఎప్పటికీ ఇలాగే ఉండాలని లేదని.. కెరీర్‌పరంగా ఏదైనా సాధించాలనుకుంటున్నానని.. ఇప్పటి వరకూ నా గురించి నేను ఆలోచించుకోలేదని.. అలాగే నా కెరీర్‌ని కూడా పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకోవాలనుకుంటున్నానని.. కెరీర్‌లో రాణించాలనుకుంటున్నానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ కన్నీరు పెట్టుకుంది.

Also read:సిరి, ష‌ణ్ణు తెలిసే చేశారు.. మాన‌స్ బ‌య‌ట‌పెట్టేశాడు!

తాజాగా దీప్తి షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. అందులో ఆమె త‌న తండ్రితో కులాసాగా గ‌డిపిన క్ష‌ణాల‌కు సంబంధించిన‌వి. బ్యాగ్రౌండ్‌లో ఎన్నెన్నో ఆశ‌ల‌తో పెంచాన‌మ్మా గుండెల్లో అనే పాట వ‌స్తుండ‌గా, తండ్రికి వెనుక ఉన్న త‌న వినైల్ పోస్ట‌ర్‌ను చూపిస్తూ ఏదో చెప్పింది దీప్తి. దానికి త‌లాడించి, కూతురి త‌ల‌పై ఆప్యాయంగా త‌ట్టాడు తండ్రి. దాంతో ఆశ్చ‌ర్య‌పోయిన దీప్తి ముందుకు వంగి ఆయ‌న కాలిపై త‌న త‌ల ఆన్చింది. ఆ వీడియో ఆ తండ్రీకూతుళ్ల అనుబంధానికి అద్దం ప‌డుతోంది. "ఆమె ఒంటరిగా నిలబడలేదు, కానీ ఆమె వెనుక నిలిచింది, ఆమె జీవితంలో అత్యంత శక్తిమంతమైన నైతిక శక్తి, ఆమె తండ్రి ప్రేమ." అంటూ ఆ వీడియోకు క్యాప్ష‌న్‌గా రాసుకొచ్చింది దీప్తి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.