English | Telugu

నాగార్జునకి బంపర్ ఆఫర్ ఇచ్చిన విష్ణుప్రియ!

బిగ్‌బాస్ అంటే ప్రేమలు, జంటలు, యవ్వారాలు మామూలుగా ఉండదు. గత సీజన్‌లలో నాలుగో వారమో, ఐదో వారమో మేల్, ఫిమేల్ కంటెస్టెంట్స్ మధ్య ప్రేమాయణాలు, ఒకరినొకరు ఇష్టపడుతున్నట్లుగా బయటపడేవారు. అయితే ఈసారి అలాంటి వ్యవహారాలను ఫస్ట్ వీక్‌లోనే మొదలెట్టేసినట్లుగా కనిపిస్తోంది. దీనిలో భాగంగానే స్టార్ యాంకర్ విష్ణుప్రియ- పృథ్వీరాజ్ మధ్య ప్రేమను పుట్టించే ప్రయత్నాలు స్టార్ట్ అయినట్లే అనిపిస్తోంది.

ఇక నిన్నటి ఎపిసోడ్ కంటెస్టెంట్స్ మధ్య ఫిట్టింగ్ పెట్టాడు నాగార్జున.. హౌస్ లో ప్రతీ ఒక్కరు రెండు అద్దాలు(మిర్రర్ బోర్డ్) తీస్కోండి. వాటిలో వారి ఫేస్ చూపించి జెలస్, సెల్ఫిష్, అన్నోయింగ్ బోర్డ్ లు ఇవ్వాలని చెప్పాడు. ఇక నిఖిల్ కి మిర్రర్ బోర్డ్ చూపించి.. చీఫ్ నుండి దిగిపోయాక నా కన్నా చిన్నపిల్లాడిలా బిహేవ్ చేస్తున్నాడంటూ విష్ణుప్రియ చెప్పింది. ఛీఫ్ నుండి దిగిపోయాకనా లేక సోనియా వెళ్ళిపోయాకనా అని నాగార్జున అనగానే.. విష్ణుప్రియతో పాటు హౌస్ అంతా నవ్వేసారు. ఇక విష్ణుప్రియని ఎక్కడి వస్తావని అడుగగా.. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని విష్ణుప్రియ అంటుంది. తెలుసుగా నా దగ్గరకి ఎప్పుడూ వస్తారో అని నాగార్జున అంటాడు. ఎలిమినేషన్ అయి బయటకొస్తే ఇక్కడ స్టేజ్ మీదకి రావచ్చని నాగార్జున ఇండైరెక్ట్ గా చెప్తాడు. ఇక విష్ణుప్రియ మనసులో మన హోస్ట్ నాగార్జున అంటే క్రష్ అని అర్థమవుతుంది. హౌస్ లో పృథ్వీతో విష్ణుప్రియ చేసే లవ్ ట్రాక్ ఎంతలా సాగుతుందో చూడాలి.

నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ లో ఉన్న నబీల్, నిఖిల్ సేవ్ అయ్యారు. ఇంకా మణికంఠ, విష్ణుప్రియ, నైనిక ఇంకా నామినేషన్ లో ఉన్నారు. వీరిలో నైనిక ఎలిమినేషన్ అనే వార్తలొచ్చాయి. మరి నైనికే ఎలిమినేషన్ అవుతుందా లేక బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తాడా చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.