English | Telugu

న‌య‌ని - విశాల్ వెలికి తీసిన పెట్టెలో ఏముంది?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌యని`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ ఆత్యంతం ఆస‌క్తిక‌ర ముల‌పుల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ తో అషికా గోపాల్‌, చందూ గౌడ జంట‌గా న‌టించారు. ఇతర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌రులు న‌టించారు. సోమ‌వారం ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుంద‌న్న‌ది ఇప్ప‌డు చూద్దాం.

పుండ‌రీనాథం ప్రాంగ‌ణంలోని స్థ‌లంలో పౌర్ణ‌మి రోజు పూజ చేసి నాగ‌లితో విశాల్ , న‌య‌ని దున్నేస్తారు. అయితే పున్న‌మి చంద్రుడు వ‌చ్చాక అద్దంలో గాయ‌త్రీదేవి చెప్పిన కాగితాన్ని చూస్తారు. అందులో ఏ స్థ‌లంలో చెట్టుకు డ‌బ్బులు కాస్తాయో వివ‌రంగా వుంటుంది. దాంతో ఓ చోట ఇద్ద‌రు క‌లిసి త‌వ్వ‌డం మొద‌లు పెడ‌తారు. ఈ విష‌యంలో అనుమానంగా వున్న క‌సి చాటుగా వారిని గ‌మ‌నిస్తూ వీడియో తీస్తూ వుంటుంది. చివ‌రికి మ‌ట్టి మొత్తం పైకి తీయ‌డంతో అక్క‌డ ఓ పురాత‌న‌మైన పెట్టె క‌నిపిస్తుంది. దాన్ని న‌య‌ని, విశాల్ బ‌య‌టికి తీస్తారు.

అయితే దానికి లాక్ వుండ‌టంతో ఏమీ చేయ‌లేక ఇంట్లోకి తీసుకెళ‌తారు. ఈ విష‌యాన్ని క‌సి తిలోత్త‌మ‌, వ‌ల్ల‌భ‌ల‌కు వివ‌రిస్తుంది. తను తీసిన వీడియోని చూపిస్తుంది. అందులో ఏముందో తెలుసుకోవాలంటే న‌య‌ని చెల్లెలు సుమ‌న‌ని రంగంలోకి దించాల్సిందేన‌ని ప్లాన్ చేసిన తిలోత్త‌మ ఒక్క నైట్ స్టే కోసం సుమ‌న‌, ఆమె భ‌ర్త ని న‌య‌ని ఇంటికి పంపిస్తుంది. న‌య‌ని ఇంటికి వెళ్ల‌గానే బ‌య‌టికి తీసిన బాక్స్ గురించి సుమ‌న ఆరా తీయ‌డం మొద‌లు పెడుతుంది. దీంతో విశాల్, న‌య‌ని షాక్ అవుతారు. ఈ బాక్స్ గురించి ఎవ‌రికీ తెలియ‌దు.. నీకెలా తెలిసిందంటారు.. ఇక తిలోత్త‌మ చెప్పిన‌ట్టే సుమ‌న అంతా ప‌డుకున్నాక ఆ పెట్టెలో ఏ ముందో తెలుసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? న‌య‌ని ఏం చేసింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.