English | Telugu

న‌య‌ని ఏం చేయ‌బోతోందో తిలోత్త‌మ తెలుసుకుందా?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రసారం అవుతోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. బెంగాలీ సీరియ‌ల్ ఆధారంగా దీన్ని తెలుగులో రీమేక్ చేశారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. అషికా గోపాల్, చందూ గౌడ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌చ నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌రులు న‌టించారు.

తిలోత్త‌మ ఇంట్లో వున్న అద్దం తీసుకొచ్చాక న‌య‌ని గాయ‌త్రీ దేవి చిత్ర ప‌టాన్ని క్లిన్ చేస్తూ వుంటుంది. అదే స‌మ‌యంలో న‌న్ను మ‌ర్చి పోయావా న‌య‌ని అంటూ గాయ‌త్రీ దేవి ఆత్మ వ‌స్తుంది. పౌర్ణ‌మి రోజు మా నాన్న గారు గీసిన బొమ్మ‌లో వున్న‌ట్టుగా చేయాల‌ని చెప్పాను క‌దా? అని న‌య‌నితో అంటుంది. వెంట‌నే న‌య‌ని ఆ ఏర్పాట్లు మొద‌లు పెడుతుంది. పౌర్ణ‌మి రోజు చ‌న్నీళ్ల‌తో త‌ను స్నానం చేసి విశాల్ కు కూడా స్నానం చేయించి పూజ‌కు సిద్ధ‌మ‌వుతుంది.

కట్ చేస్తే.. తిలోత్త‌మ ఇంట్లో న‌య‌ని చెల్లెలు సుమ‌న ప‌ల్లెం, చెంబు ప‌ట్టుకుని హాలు లోకి వ‌స్తుంది. అది చూసిన విక్రాంత్ ఏంటిది? ఏం చేస్తున్నావ్ అంటూ అడుగుతాడు. ఉప‌వాసం వున్నానండీ అని చెబుతుంది సుమ‌న‌. క‌ట్ చేస్తే .. నాగ‌లికి న‌య‌ని, విశాల్ పూజ చేయాల‌ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ విష‌యాన్ని వెట‌కారంగా తిలోత్త‌మ,క‌సిల‌కు చెబుతాడు వ‌ల్ల‌భ‌. ఏమీ లేని విశాల్ ఈ ప్ర‌పంచాన్ని దున్న‌డానికి నాగ‌లిని తెప్పించాడ‌ట అని ఠ‌క్కున్న చెప్పేస్తాడు. దీంతో న‌య‌ని ఏదో చేయ‌బోతోంది. మ‌నం ఇక్క‌డ కూర్చుని చ‌ర్చించుకోవ‌డం కాదు అక్క‌డికి వెళ్లి వాళ్లు ఏం చేస్తున్నారో గ‌మ‌నించాల‌ని విశాల్ వుండే చోటుకి వెళ‌తారు. వ‌చ్చిన వారిపై ఆవు పంచ‌కం( గో మూత్రం) ని చ‌ల్లుతుంది. అదేంటో తెలియ‌క అంతా చిరాకు ప‌డ‌తారు. ఆ త‌రువాత న‌య‌ని, విశాల్ నాగ‌లితో ఆ ప్రాంతాన్ని దున్నేస్తారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.