English | Telugu
వేద ప్రెగ్నెంట్ అన్న డాక్టర్.. షాక్ లో యష్!
Updated : Jun 18, 2022
నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. స్టార్ ప్లస్‌లో సూపర్ హిట్ గా నిలిచిన `యే హై మొహబ్బతే` ఆధారంగా ఈ సీరియల్ ని తెలుగులో రీమేక్ చేశారు. గత కొన్ని వారాలుగా బుల్లితెర ప్రేక్షకుల్ని, ప్రధానంగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులోని ఇతర పాత్రల్లో మిన్ను నైనిక, బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్, సుమిత్ర, రాజా శ్రీధర్ తదితరులు నటించారు.
గతంలో టెండర్ విషయంలో తనకు అండగా నిలిచి రూ. 60 కోట్లు నష్టపోకుండా చేసిన వేదని అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెట్టానని యష్ ఫీలవుతుంటాడు. తనకు ఎలాగైనా సారీ చెప్పాలనుకుంటాడు. అది ఎలా చెప్పాలా అని ఆలోచించి బెడ్ పై పూలతో సారీ అని రాసి వేదని ఏదో పని వుందన్నట్టుగా పిలుస్తాడు యష్. కానీ గదిలోకి వచ్చిన వేద బెడ్ పై యష్ రాసిన అక్షరాలని చూడకుండా వెళ్లిపోతుంది. మరో సారి ఫైల్స్ కనిపించడం లేదని పిలుస్తాడు. అదే సమయంలో వేద పెంచుకుంటున్న కుక్క పిల్ల బెడ్ పైకి చేరి యష్ పూలతో రాసిన 'సారీ'ని చెరిపేస్తుంది.
దీంతో ఇక్కడ పూలు ఎవరు చల్లారని, వాటిని వెంటనే క్లీన్ చేయమని యష్ కు చెబుతుంది. దీంతో యష్ 'ఇంత ప్రయత్నించినా వేద గుర్తించడం లేదేంటీ?' అని ఫీలవుతాడు. ఇదే సమయంలో అంతా ఏదో ఫంక్షన్ కి బయటికి వెళ్లిపోతుంటారు. చివర్లో వేద, యష్, ఖుషీ మాత్రమే వుంటారు. వేద రెడీ అయితే వెళదామని తొందర పెడతాడు యష్. తొందర పెడితే కుదరదని చెబుతుంది వేద. దీంతో నిదానంగా రెడీ అయి రమ్మని ఖుషీని తీసుకుని కింద వెయిట్ చేస్తుంటానని వెళతాడు యష్..
ఇదే సమయంలో వేద బట్టలు మార్చుకుని రెడీ అవుతుంటే తనపై కన్నేసిన యష్ బావ కైలాష్ చాటుగా వేదని చూస్తూ వుంటాడు. అది వేద అద్దంలోంచి గమనించి షాక్ కు గురవుతుంది. కట్ చేస్తే.. అంతా ఫంక్షన్ నుంచి ఇంటికి తిరిగి వస్తారు. వేద కళ్లు తిరిగి పడిపోతుంది. పరీక్షించిన డాక్టర్ వేద ప్రెగ్నెంట్ కావచ్చని చెబుతుంది. దీంతో యష్ షాక్ కు గురవుతాడు. అసలు ఏం జరిగింది? .. ఏం జరగబోతోంది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.