English | Telugu

Jayam serial: బెస్ట్ ఆర్గనైజ్ అవార్డ్ సొంతం చేసుకున్న పెద్దసారు.. పారు ప్లాన్ అదే!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -157 లో.. పెద్దసారుకి ఎవరో ఒకతను ఫోన్ చేసి ఫుడ్ ఫెస్టివల్ మీరు ఆర్గనైజ్ చేశారు కదా.. దానికి గాను మీకు బెస్ట్ ఆర్గనైజ్ అవార్డ్ వచ్చిందని చెప్పడంతో పెద్దసారు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంట్లో అందరిని పిలిచి ఆ విషయం చెప్తాడు. అప్పుడే రుద్ర వస్తుంటే అందరు కంగ్రాట్స్ అని చెప్తారు. మీ వల్లే సక్సెస్ అయింది.. మినిస్టర్ గారికి దగ్గర ఉండి మరి అన్ని ఎక్స్ ప్లెయిన్ చేసావ్.. గంగ తన ప్రాణాలు అడ్డుపెట్టి మినిస్టర్ ని కాపాడిందని పెద్దసారు అంటాడు.

ఇషిక, వీరు మీక్కూడా స్పెషల్ థాంక్స్ అని పెద్దసారు చెప్పగానే.. చేసింది ఇషిక, వీరు అయితే వాళ్ళని పొగడడం ఎందుకని శకుంతల అంటుంది. అప్పుడే పారు ఎంట్రీ ఇస్తుంది. వచ్చావా ఇంకా రాలేదేంటి అనుకున్నానని పెద్దసారు అంటాడు. ఒక గుడ్ న్యూ స్ చెప్పడానికి వచ్చాను. నేను రాబోయే ఛాంపియన్ షిప్ లో పార్టీసిపేట్ చేస్తున్నానని పారు చెప్తుంది. నేనే ఎలాగూ గెలుస్తానని పారు పొగరుగా మాట్లాడుతుంటే.. తన పొగరుని తగ్గించడానికి నేను నిన్ను ఓడిస్తానని గంగ చెప్తుంది. ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ రోజే రుద్ర, గంగల శోభనం అని పెద్దసారు చెప్తాడు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయమని ఇందుమతికి పెద్దసారు చెప్తాడు.

ఆ తర్వాత రుద్ర గదిలో ఉండగా గంగ లోపలికి వెళ్తుంది. నిన్ను ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసు కదా అని రుద్ర అనగానే తెలుసు సర్ మీ లక్ష్యం నా ద్వారా నెరవేరాలని కోరుకుంటున్నారు.. నాకు తెలుసని గంగ చాప తీసుకొని వచ్చి నేలపై పడుకుంటుంది. థాంక్స్ గంగ అని రుద్ర అంటాడు.

అప్పుడే రుద్రకి పారు ఫోన్ చేసి.. నువ్వు లేకుండా నేను ఉండను చనిపోతున్నానని ఫోన్ కట్ చేస్తుంది. రుద్ర టెన్షన్ గా మళ్ళీ కాల్ చేస్తాడు. అప్పుడు పారు తన ఫ్రెండ్ ని మాట్లాడమని చెప్తుంది. సర్ పారు డిప్రెషన్ లో ఉందని సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. మీరు ఎక్కడున్నా ఇక్కడికి రండి అని ఆమె అనగానే వస్తున్నానని రుద్ర అంటాడు. ఆమె సిటీ హోటల్ అని తను ఉండే అడ్రెస్ చెప్తుంది. రుద్ర కంగారుగా బయల్దేరతాడు. పారు తన ఫ్రెండ్ కలిసి రుద్రని ట్రాప్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.