English | Telugu
గాయత్రీదేవి ఆత్మ నయనికి చెప్పిన అద్దం రహస్యం!
Updated : Jun 18, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'త్రినయని'. తల్లి హత్య వెనకున్న రహస్యం తెలియని ఓ కొడుకు.. ఆ కొడుకు కోసం తపించే తల్లి ఆత్మ.. జరగబోయేది ముందే తెలిసే ఓ యువతి పాత్రల నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథే ఈ సీరియల్. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రసారం అవుతోంది. బెంగాలీ సీరియల్ ఆధారంగా దీన్ని తెలుగులో రీమేక్ చేశారు. ప్రధాన జంటగా అషికా గోపాల్, చందూ గౌడ నటించారు. ఇతర పాత్రల్లో పవిత్ర జయరామ్, నిహారిక హర్షు, విష్ణు ప్రియ, శ్రీసత్య, భావనా రెడ్డి, సురేష్ చంద్ర, అనిల్ చౌదరి, ద్వారకేష్ నాయుడు తదితరులు నటించారు.
తిలొత్తమ అనుభవిస్తున్న ఆస్తి విశాల్ కే దక్కాలని గాయత్రీ దేవి తండ్రి పుండరీనాథం తను రాసిన వీలునామాలో ఓ రహస్య సమాచారాన్ని పొందుపరుస్తాడు. అందులోని ఓ కాగితంలో బాబుని ఎత్తుకుని వున్న ఓ యువతి చందమామను చూపిస్తూ వుంటుంది. అందులో వున్న రహస్యాన్ని నయని కోసం వచ్చిన గాయత్రీ దేవి ఆత్మ వివరిస్తుంది. పున్నమి రోజు రాత్రి ప్రకాశించే చందమామ వెలుగులో మా నాన్నగారు గీసిన చిత్రాన్ని పెట్టి అద్దంలో చూస్తే నీకు అసలు రహస్యం ఏంటో అర్థమవుతుందని చెబుతుంది. ఆ మాటలకు 'అద్దంలో చూడాలా?' అంటుంది నయని. 'అవును' అని తిలోత్తమ ఇంట్లో వున్న పెద్ద అద్దాన్ని తీసుకొచ్చి అందులో చూడాలని గాయత్రీదేవి ఆత్మ చెబుతుంది.
ఆ ఇంట్లో తన వద్ద వున్న అద్దాన్ని తిలోత్తమ అత్తయ్య ఇవ్వదు.. ఇప్పుడు ఎలా అమ్మగారు అని అమాయకంగా అడుగుతుంది నయని.. దీనికో మాస్టర్ ప్లాన్ చెబుతుంది. దీంతో మారువేషాల్లో అద్దం కోసం విశాల్ , నయని రంగంలోకి దిగుతారు. తిలోత్తమ కళ్లుగప్పి గాయత్రీదేవి చెప్పిన అద్దాన్ని పెద్దింట్లోంచి సేఫ్ గా తీసుకురాగలిగారా?.. దీనికి కసి, వల్లభ ఎలాంటి అడ్డంకుల్ని సృష్టించారన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.