English | Telugu

వర్షిణి... వైఫ్‌ ఆఫ్‌ సుమంత్‌! ఇది నిజమే!!

వర్షిణి... వైఫ్‌ ఆఫ్‌ సుమంత్‌! మీరు చదివింది నిజమే! అందులో ఏమాత్రం తప్పు లేదు. తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని సుమంత్‌ క్లారిటీ ఇచ్చారు కదా! మళ్లీ అతడికి వైఫ్‌ ఏంటని డౌటు పడుతున్నారా? సుమంత్‌కు వర్షిణి భార్య అయినది రియల్‌ లైఫ్‌లో కాదు, రీల్‌ లైఫ్‌లో! రెండో పెళ్లి చేసుకోవడం లేదని చెప్పిన సుమంత్‌, ప్రజెంట్‌ తాను చేస్తున్న సినిమా విడాకులు, మళ్లీ పెళ్లి చేసుకోవడం పాయింట్‌తో రూపొందుతోందని చెప్పిన సంగతి తెలిసిందే.

సుమంత్‌ హీరోగా యాక్ట్‌ చేస్తున్న లేటెస్ట్‌ సినిమా ‘మళ్లీ మొదలైంది’. పెళ్లి, విడాకుల తర్వాత జీవితం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇందులో నైనా గంగూలీ హీరోయిన్‌. అయితే, ఆమెతో పాటు ఫేమస్‌ యాంకర్‌ వర్షిణి కూడా యాక్ట్‌ చేస్తోంది. సుమంత్‌ వైఫ్‌ క్యారెక్టర్‌లో వర్షిణి కనిపించనుంది. సినిమాలో ఆమెకు ఇంపార్టెంట్‌ రోల్‌ దక్కిందట.

హీరోయిన్‌గా వర్షిణి కెరీర్‌ స్టార్ట్‌ చేసినా... టీవీ షోలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ క్రేజీ సినిమాల్లో ఇంపార్టెంట్‌ రోల్స్‌ వచ్చాయి. సమంత ‘శాకుంతలం’తో పాటు సుమంత్‌ ‘మళ్లీ మొదలైంది’లో నటిస్తోంది. రెండూ అక్కినేని ఫ్యామిలీ స్టార్స్‌ సినిమాలు కావడం విశేషమే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.