English | Telugu

సమంత భారీ సినిమాలో వర్షిణికి ఛాన్స్

బుల్లితెర ప్రేక్షకులకు వర్షిణి ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. గతంలో 'ఢీ' షో, ఇప్పుడు 'కామెడీ స్టార్స్'తో ఆమెకు పాపులారిటీ బాగా పెరిగింది. అయితే, వర్షిణి ప్రయాణం బుల్లితెర మీద కాదు... వెండితెరపై మొదలైంది. కానీ, ఎక్కువ గుర్తింపు తెచ్చింది మాత్రమే బుల్లితెరే. మధ్య మధ్యలో సినిమాలు చేస్తున్నా సరైన సినిమా పడలేదు. చాలా రోజుల తర్వాత వర్షిణికి భారీ సినిమాలో అవకాశం వచ్చింది.

సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చారిత్రక దృశ్యకావ్యం 'శాకుంతలం'. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో వర్షిణి నటిస్తున్నారు. ఆమెకు చెంతకు అవకాశం వచ్చిన వెంటనే ఓకే చెప్పేశారట. అయితే, సినిమాలో తన పాత్ర ఏమిటన్నది వర్షిణి చెప్పలేదు. షూటింగ్ స్టార్ట్ చేశానని మాత్రమే వెల్లడించారు. ఒకటి కంటే ఎక్కువ లుక్స్ లో కనిపించనున్నారట. సమంతతో షూటింగ్ చేయడం చాలా సంతోషంగా ఉందని వర్షిణి చెబుతోంది.

"సమంత చాలా స్వీట్" అని వర్షిణి ప్రశంసల వర్షం కురిపిస్తోంది. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇతర ఆర్టిస్టుల గురించి సమంత ఎంత కేర్ తీసుకుంటారో చెప్పుకొచ్చింది. "ఒక సన్నివేశంలో నేను మోకాళ్ళ మీద కూర్చుని డైలాగ్ చెప్పాలి. ఎమోషనల్ సీన్ అది. ఫ్లోర్ మీద రాళ్లు ఉన్నాయి. అంత కంఫర్టబుల్ గా లేదు. నేను పాయింట్ అవుట్ చేయడానికి ముందే సమంతగారు గమనించారు. నా మోకాళ్ళ కింద ఏదైనా క్లాత్ వేస్తే ఇబ్బంది ఉండదని చెప్పారు. అంతపెద్ద స్టార్ అలా చెప్పడం గ్రేట్" అని వర్షిణి షూటింగ్ అనుభవాన్ని గుర్తు చేసుకుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.