English | Telugu

"నేనొక ఆడపిల్లను.. జాలి లేదా?".. భోరుమ‌న్న వ‌ర్ష‌! వెంట‌నే ప్రోమో డిలీట్‌!

వర్ష 'జబర్దస్త్'కు గుడ్ బై చెప్పాలని అనుకుంటుందా? ఇకపై షోలో కనిపించదా? మానేస్తుందా? ఆగస్టు 13న టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్ ప్రోమో లేటెస్టుగా విడుదలైంది. అది చూస్తే నిజమే అని ఎవరికైనా అనిపించక మానదు.

"వర్ష... ఏంటి? 'జబర్దస్త్' మానేయాలని అనుకుంటున్నట్టు తెలిసింది. ఏం జరిగింది?" అని రోజా అడిగారు. ఈ తర్వాత వర్ష ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. "మనవరకూ అవన్నీ చాలా ఈజీ మేడమ్. కానీ, మనం ఇక్కడ ఉండటం వేరు. మన ఇంట్లో వేరు" అని వర్ష కన్నీరు పెట్టుకుంది. బోరున విలపించింది.

"మా తమ్ముడు నా ఫేస్ మీద ఫోన్ పెట్టి... ఏంటక్కా? అని అడిగితే నేను ఫేస్ చేయలేకపోయా" అని వర్ష కన్నీళ్లు తుడుచుకుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో 'వకీల్ సాబ్'లోని 'మగువా మగువా' పాటను ప్లే చేశారు. 'నిందలు వేస్తారు. నిను వెలివేస్తారు' లైన్లు వినిపించాయి. దీన్నిబట్టి ఎవరో చేసిన విమర్శల గురించి ఇంట్లో ప్రశ్నించినట్టు ఉన్నారని అర్థమవుతోంది.

"నేను అందరినీ ఒకటే అడుగుతాను. మీ ఇంట్లో మీ సిస్టర్ ఉన్నప్పుడు ఎవరైనా చిన్న మాట అంటే 'ఏయ్ మా సిస్టర్ ను ఎందుకన్నావ్' అని మీకంత కోపం వస్తుంది కదా. మీరు ఏదైనా అన్నప్పుడు... నేనొక ఆడపిల్లను కదా. మీకు ఇంత కూడా జాలి అనిపించిందా?' అని వర్ష కన్నీరు పెట్టుకుంది. ఈ విమర్శలు తట్టుకోలేక సోషల్ మీడియాలో ఫోటోల కింద కామెంట్ ఆప్షన్ డిజేబుల్ చేసినట్టు ఉంది. కాగా ప్రోమో రిలీజ్ చేసిన కొద్దిసేప‌టికే దాన్ని యూట్యూబ్ నుంచి ఈటీవీ, మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్ రెండూ తొలగించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. వ‌ర్ష ఎపిసోడ్ వ‌ల్లే దాన్ని తొల‌గించారా? ఆ ఎపిసోడ్‌ను రీ-ఎడిట్ చేస్తున్నారా?.. అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.