English | Telugu

వృద్ధాశ్రమానికి లక్ష విరాళం ఇచ్చిన బుల్లితెర బ్యూటీలు!

'జబర్దస్త్', 'ఎక్స్ ట్రా జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ'... వారంలో కనీసం రెండు రోజులైనా ఏదో ఒక కార్యక్రమంలో సందడి చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను వర్ష ఎట్రాక్ట్ చేస్తోంది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'తో పాటు యూట్యూబ్ కోసం ప్రత్యేకంగా పాత స్కిట్లతో చేస్తున్న కార్యక్రమంలో భాను సందడి చేస్తోంది. వీళ్ళిద్దరూ ఓ వృద్ధాశ్రమానికి లక్ష రూపాయల విరాళం ఇచ్చారు.

అక్టోబర్ 3న ప్రసారం కానున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఎపిసోడ్ కోసం ఓ వృద్ధాశ్రమం నుంచి కొంత మందిని తీసుకువచ్చారు. వాళ్లను హ్యాపీగా ఉంచడం కోసం ఈవెంట్ చేస్తున్నామని చెప్పారు. కొంత మంది వృద్ధులు చెప్పిన కష్టాలు విని వర్ష, భాను చలించిపోయారు. వెంటనే ఆ వృద్ధాశ్రమానికి లక్ష రూపాయల విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. వేదిక మీదే వర్ష చెక్కును అందజేసింది. ఓ పెద్దావిడ కాళ్ళకు నమస్కరించి కన్నీళ్లు పెట్టుకుంది. భాను డబ్బులు అందజేసింది. తమకు అందం మాత్రమే కాదు గొప్ప మనసు కూడా ఉందని వీళ్ళిద్దరూ నిరూపించుకున్నారు.

దానికి ముందు వృద్ధాశ్ర‌మం నేప‌థ్యంలో క‌మెడియ‌న్స్ వేసిన స్కిట్‌కు అంద‌రూ చ‌లించిపోయారు. ఇంద్ర‌జ స‌హా అంద‌రూ క‌న్నీరు పెట్టుకున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.