English | Telugu

అప్పుడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్.. మహేషే ఫినిషర్!

టాలీవుడ్ లో పలువురు స్టార్స్ హోస్ట్ లుగా మారి అలరిస్తుంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ షోస్ లో గెస్ట్ గా పాల్గొని వినోదాన్ని పంచుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన 'ఎవరు మీలో కోటీశ్వరులు' ముగింపు ఎపిసోడ్ లో పాల్గొని సందడి చేసిన మహేష్.. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ముగింపు ఎపిసోడ్ తో ఎంటర్టైన్ చేయనున్నారు.

మహేష్ ఎపిసోడ్ టెలికాస్ట్ విషయంలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోనే 'అన్ స్టాపబుల్' ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. మహేష్ ఎపిసోడ్ షూట్ చాలారోజుల క్రితమే జరిగినా.. ఆ ఎపిసోడ్ ని కావాలని హోల్డ్ చేసి.. ముగింపు ఎపిసోడ్ గా ప్రసారం చేశారు ఈఎంకే నిర్వాహకులు. ఇప్పుడు 'అన్ స్టాపబుల్' షో నిర్వాహకులు కూడా అదే చేస్తున్నారు. 'అన్ స్టాపబుల్'లో మహేష్ పాల్గొన్న ఎపిసోడ్ షూట్ ఇప్పటికే జరిగింది. అయితే ఈ ఎపిసోడ్ ని 'అన్ స్టాపబుల్' షో మొదటి సీజన్ ముగింపు ఎపిసోడ్ గా టెలికాస్ట్ చేయనున్నామని తాజాగా ఆహా ప్రకటించింది.

'అన్ స్టాపబుల్' షోకి సంబంధించి ఇప్పటికే ఐదు ఎపిసోడ్స్ విడుదలయ్యాయి. అల్లు అర్జున్ పాల్గొన్న ఆరో ఎపిసోడ్ డిసెంబర్ 25 నుండి, క్రాక్ కాంబో రవితేజ, గోపీచంద్ మలినేని పాల్గొన్న ఏడో ఎపిసోడ్ డిసెంబర్ 31 నుండి స్ట్రీమింగ్ కానున్నాయి. మరి మహేష్ పాల్గొన్న ముగింపు ఎపిసోడ్ ఎనిమిదవ ఎపిసోడ్ గా ప్రసారమవుతుందా? లేక ఇతర సెలెబ్రిటీలతో ఈ సీజన్ లో మరికొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.