English | Telugu

మీసం తిప్పిన రాజమౌళికి పంచ్.. మీ హీరోల సినిమాలు ఫసక్కేగా!

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ఐదో ఎపిసోడ్ లో దర్శకధీరుడు రాజమౌళి పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేసింది ఆహా. ప్రోమోలో బాలయ్య, రాజమౌళి మధ్య సంభాషణ ఆసక్తికరంగా ఉంది.

రాజమౌళి ఎప్పటిలానే అన్ స్టాపబుల్ కి కూడా తెల్ల గడ్డంతో వచ్చారు. రాజమౌళి గడ్డం చూసిన బాలయ్య.. 'మీరు ఆల్రెడీ ఇంటెలిజెంట్ అని, అచీవర్ అని అందరికీ తెలుసు.. మరి ఇంకెందుకు ఈ తెల్ల గడ్డం' అని అడగగా.. రాజమౌళి ఏ సమాధానం చెప్పకుండా గడ్డం సరిచేసుకుంటూ కనిపించారు. 'ఇప్పటిదాకా మన కాంబినేషన్ లో సినిమా పడలేదు. నా అభిమానులు నిన్ను బాలయ్యతో సినిమా ఎప్పుడని అడిగారు. మీ సమాధానం ఏంటి అసలు' అని బాలయ్య అడగగా.. రాజమౌళి మళ్ళీ సమాధానం చెప్పకుండా మీసం మెలేస్తూ ఓ లుక్ ఇచ్చారు. 'మీతో సినిమా చేస్తే హీరోకి, ఇండస్ట్రీకి హిట్ ఇస్తారు.. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు ఫసక్కేగా' అని బాలయ్య అనడంతో.. రాజమౌళి జుట్టు సరిచేసుకుంటూ కనిపించారు. 'సమాధానాలు చెప్పరేంటి రాజమౌళి?'.. అని బాలయ్య అడగగా.. 'అందరికీ తెలుసు ఇది ప్రోమో అని.. నా సమాధానాలు ఎపిసోడ్ లో చెప్తాను అని' రాజమౌళి సమాధానం ఇచ్చారు.

ప్రోమో సరదాగా ఆకట్టుకునేలా ఉంది. ఈ ఎపిసోడ్ ఈ నెల 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ లో రాజమౌళితో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కూడా సందడి చేయనున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా సర్ ప్రైజ్ ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.