English | Telugu

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కు ఊహించ‌ని స్టార్స్

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ క్లైమాక్స్ కి చేరింది. మ‌రో ఐదు రోజుల్లో ముగియ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో గ్రాండ్ ఫినాలే ఎలా వుండ‌బోతోంది.. భారీ స్థాయ‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఈవెంట్ కు గెస్ట్ లుగా ఎవ‌రెవ‌రు రాబోతున్నారు? అన్న‌ది హాట్ టాపిక్ గా మారింది. గ‌త కొన్ని వారాలుగా ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతూ వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారుతోంది. కాజ‌ల్ ఎలిమినేష‌న్ తో హౌస్ లో మొత్తం 5 గురు కంటెస్టెంట్ లు మిగిలారు.

4 గంట‌లు బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్ట్‌లో న‌ర‌క‌యాత‌న ప‌డ్డ‌ వ‌నిత‌.. ఎందుకో తెలుసా?

టాప్ 5 కంటెస్టెంట్ లు మిగిలారు. ఇక ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడొక‌లెక్క అన్న‌ట్టుగా హౌస్ వాతావ‌ర‌ణం మారింది. టాప్ 5 కి చేరిన కంటెస్టెంట్ ల‌లో ఆదివారం జ‌రిగే గ్రాండ్ ఫినాలేలో ఎవ‌రు విజేత‌గా నిలుస్తార‌న్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా వుంటే గ్రాండ్ ఫినాలేకి ఈ సారి భారీ స్థాయిలో ఊహించ‌ని గెస్ట్ లు, స్టార్ లు రానున్నార‌ని తెలుస్తోంది.

డిసెంబ‌ర్ 19న జ‌రగ‌నున్న గ్రాండ్ ఫినాలేను నెవ‌ర్ బిఫోర్ అనే రేంజ్‌లో నిర్వ‌హించాల‌ని నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్రాండ్ ఫినాలేకు `ఆర్ ఆర్ ఆర్` టీమ్ గెస్ట్ లుగా వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే బాలీవుడ్ క్రేజీ స్టార్ ల‌ని ఈ ఈవెంట్ కి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్ క‌పుల్ ర‌ణ్ వీర్ సింగ్, దీపికా ప‌దుకోన్ ల‌తో పాటు అలియాభ‌ట్ కూడా పాల్గొననుంద‌ని , ఇందు కోసం మేక‌ర్స్ సంప్ర‌దింపులు జరుపుతున్నార‌ని తెలిసింది. ఇదే నిజ‌మైతే గ్రాండ్ ఫినాలే మ‌రింత గ్రాండ్ గా వెలిగిపోవ‌డం ఖాయం.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.