English | Telugu
వరూధినికి పెళ్లయిపోయింది!
Updated : Jul 26, 2022
బుల్లితెర ఆర్టిస్టులు ఒక్కొక్కరిగా పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ ఐపోతున్నారు. ఇప్పుడు కన్నడ భామ చందనా శెట్టి కూడా వివాహం చేసేసుకుని మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేసేస్తోంది. ఈమె గురించి పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. 'వరూధిని పరిణయం' సీరియల్‌లో నటించింది చందన. అలాగే 'స్వర్ణ ప్యాలేస్', 'పవిత్ర బంధం', 'దేవయాని' వంటి సీరియల్స్ లో నటించింది. కన్నడలో వచ్చే మూవీస్ కి చందన డబ్బింగ్ చెప్తూ ఉంటుంది.
అలాగే మరో వైపు యాంకరింగ్ చేస్తూ ఇలా తెలుగు, కన్నడలో సీరియల్స్ చేస్తూ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యింది. ఇక చందన తన చిన్నతనంలో కర్నాటిక్, వెస్ట్రన్ మ్యూజిక్ కూడా నేర్చుకుంది. సింగర్ కావాలనుకుంది కానీ కాలేకపోయింది. మంచి నటిగా అవకాశాలు వచ్చేసరికి వాటి మీద దృష్టి పెట్టింది చందన.
ఐతే చందన రీసెంట్‌గా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తన పెళ్లి ఫోటోలను రివీల్ చేసింది సోషల్ మీడియాలో. చందన భర్త పేరు అనిల్. అతను తెలంగాణకు చెందిన వ్యక్తి. ప్రస్తుతం తన భర్తతో కలిసి యూఎస్ కి వెళ్ళిపోయింది చందన. 'వరూధిని పరిణయం' సీరియల్ ఐపోయినా కానీ అందులో వరూధినిని మాత్రం ఆడియన్స్ ఎవరు మర్చిపోలేదు. చందన అనే పేరు కంటే కూడా వరూధిని గానే చాలామంది గుర్తుపడతారు.
ఆ హ్యాపీ మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోవడానికి చందన తన చేతి మీద 'వరూధిని' అనే పేరుని టాటూగా కూడా అప్పట్లో వేయించేసుకుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ నెటిజన్స్ కి ఏ సీజన్ ఎలాంటి బ్యూటీ టిప్ అవసరమో కూడా చెప్తూ ఉంటుంది వరూధిని అలియాస్ చందనా శెట్టి.