English | Telugu

తులసికి తగ్గ కోడలు అంకిత

లాస్య, భాగ్య ఇద్దరూ కలిసి గాయత్రీ దగ్గరకు వచ్చి తులసి పోగొట్టుకున్న డబ్బుకు అంకిత షూరిటీ సంతకం చేసిందని చెప్పేసరికి గాయత్రీ కోపంతో ఊగిపోతూ ఉంటుంది. గాయత్రీకి తులసి మీద లేని పోని చాడీలు చెప్పి ఇంకా రెచ్చగొడతారు. మరో వైపు పరంధామయ్య వచ్చి అంకిత ఎందుకు షూరిటీ సంతకం చేసావని అడుగుతాడు. ఏం చేయాలో అర్ధం కాలేదు నేను సంతకం పెట్టడం తప్పు కాదనిపించి పెట్టేసాను అంటుంది. ఇక తులసి వేడి వేడి మిర్చి బజ్జీలు తెస్తుంది. అదే టైం కి గాయత్రి అక్కడికి వచ్చి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది.

గాయత్రీ మాటలు విని అంకిత భయపడేసరికి గాయత్రి ఇంకా ఇంకా విరుచుకుపడుతుంది. ఏం జరిగిందో చెప్పకుండా అరిస్తే ఎలా అని తులసి అడిగేసరికి షూరిటీ సంతకం గురించి చెప్తుంది. అంకిత చేయలేదు అంటూ బుకాయిస్తుంది. తులసి దివ్య మీద ఒట్టేసి చెప్తాను ఈ విషయం గురుంచి ఏమీ తెలీదు అనేసరికి అంకిత అడ్డుపడి తాను షూరిటీ సంతకం చేశానని చెప్పేస్తుంది. తనకు తెలియకుండా ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నావంటూ తులసి అంకితను నిలదీస్తుంది.

గాయత్రి మాత్రం ఊరుకోకుండా దీనికి అంతటికి కారణం తులసి అని ఇంకా తిట్టిపోస్తుంటుంది. అప్పుడు తులసి నీకు నా సొంత డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను అంటూ మాట ఇస్తుంది. మరో వైపు లాస్య, భాగ్య ఇద్దరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తారు. ఇక తులసి రంజిత్ కాల్ లిస్ట్ సంపాదిస్తుంది. అందులో లాస్య కాల్స్ చాలా ఎక్కువగా ఉండేసరికి ఇదంతా లాస్య చేయించిన కుట్ర అని అర్థమైపోతుంది. ఈసారి లాస్యను ఊరుకునేది లేదు అంటుంది తులసి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.