English | Telugu

'బిగ్ బాస్ 5'కు భార్యతో ర‌మ్మ‌న్నా ఓకే.. ఒక్కడినే ర‌మ్మ‌న్నా ఓకే!

చైనా కంపెనీకి చెందిన 'టిక్ టాక్' యాప్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, ఆ‌ యాప్ కొంత మందికి మేలు జరిగింది. అందులో దుర్గారావు దంపతులు ఖచ్చితంగా ఉంటారు.‌ తొలుత 'టిక్ టాక్'‌ ద్వారా వారిద్దరూ ప్రజలకు వినోదం అందించేవారు. తర్వాత వాళ్లను చాలామంది టీవీ షోలను ఆహ్వానించడం మొదలుపెట్టారు. బుల్లితెరపై కూడా దుర్గారావు దంపతులకు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది.

అందువల్ల, వారిద్దరిని 'బిగ్ బాస్' రియాల్టీ షోలోకి తీసుకోవడానికి స్టార్ మా ఛానల్, షో నిర్వాహకులు ఆలోచిస్తున్నాట.‌ దీనిపై దుర్గారావు స్పందించాడు. బిగ్ బాస్‌ గురించి తనకు ఒకరు ఫోన్ చేశారని చెప్పాడు. 'బిగ్ బాస్'లో పాల్గొనే అవకాశం వస్తే మీరు పెళతారా? అని దుర్గారావును ప్రశ్నించగా... "తప్పకుండా వెళతాను" అని అతడు సమాధానమిచ్చాడు.

అయితే ఇదివ‌ర‌కు భార్య‌తో క‌లిసి ర‌మ్మంటేనే వెళ‌తాన‌ని చెప్పిన అత‌ను, ఇప్పుడు మ‌న‌సు మార్చుకున్నాడు. "గతంలో ఒక టీవీ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాతో సహా నా భార్యను కూడా తీసుకువెళ్లే అవకాశం ఉంటేనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళతానని చెప్పాను. ఇద్దరినీ రమ్మని పిలిస్తే ఇద్దరం వెళ్దాం. లేదంటే నన్ను ఒక్కడినే రమ్మన్నా వెళతాను. నా భార్యను తీసుకువెళ్లే అవకాశం లేకపోయినా పర్వాలేదు" అని దుర్గారావు చెప్పాడు. 'బిగ్ బాస్' ఇంటిలోకి వెళ్లే కంటెస్టెంట్ మల తుది జాబితాలో అతనికి చోటు దక్కుతుందో? లేదో? చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.