English | Telugu

సుమ‌క్క అని పిలిచిన గంగ‌వ్వ‌.. షాకైన సుమ‌!

యాంకర్‌ సుమ అంటే టీవీ సెలబ్రిటీలు అందరూ రెస్పెక్ట్‌ ఇస్తారు. ప్రజెంట్‌ టీవీలో టాప్‌ పొజిషన్‌లో ఉన్న యాంకర్లు అనసూయ, రష్మీ గౌతమ్‌, ప్రదీప్‌, రవి, వర్షిణీ సౌందర్‌రాజన్‌ తదితరుల కంటే సుమ సీనియర్‌. సీనియరే కాదు, వాళ్ళ కంటే ఆమెది టాప్‌ పొజిషన్‌. ఒక రకంగా ఎవరూ రీప్లేస్‌ చేయలేని పొజిషన్‌. అందుకని, అందరూ సుమను ‘సుమక్క’ అని పిలుస్తుంటారు.

వయసులో చిన్నవాళ్ళు అక్క అనడంలో అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ, సుమ కంటే ఎన్నో ఏళ్ళు పెద్దదైన అవ్వ అక్క అంటే ఆశ్చర్యం కంటే షాక్‌ ఎక్కువ కలుగుతుంది. అటువంటి షాక్‌ రీసెంట్‌గా సుమకు తగిలింది.

గతంలో కొంతమందికి తెలిసిన గంగవ్వ, ‘బిగ్‌ బాస్‌’ పుణ్యమా అంటూ టీవీ చూసే జనాల్లో మ్యాగ్జిమమ్‌ ఆడియన్స్‌కు తెలిసింది. సుమ యాంకరింగ్‌ చేస్తున్న ‘స్టార్ట్‌ మ్యూజిక్‌’ ప్రోగ్రామ్‌కు గంగవ్వ గెస్ట్‌గా వచ్చింది. గేమ్స్‌ ఆడింది. మాటల మధ్యలో ‘సుమక్క’ అనేసింది గంగవ్వ. ఇంకేముంది? స్పాంటేనియస్‌గా రియాక్ట్‌ అయ్యే సుమ కూడా ఒక్క క్షణం షాక్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. మరి, ప్రోగ్రామ్‌లో ఇంకెన్ని వింతలు చోటు చేసుకున్నాయో తెలియాలంటే ఆదివారం వరకూ వెయిట్‌ చేయాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.