English | Telugu

వేలానికి సుడిగాలి సుధీర్.. మ‌రి కొనేది ఎవ‌రు?

మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్వ‌హిస్తున్న జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోల‌లో సుడిగాలి సుధీర్ చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. హైప‌ర్ ఆది. ఆటో రాంప్ర‌సాద్ ల‌తో క‌లిసి సుడిగాలి సుధీర్ ఈ రెండు షోల‌లో త‌న‌దైన పంచ్ ల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. అయితే గ‌త కొంత కాలంగా `శ్రీ‌దేవి డ్రామా కంప‌నీ` అంటూ మ‌రో కొత్త కామెడీ షోని కూడా ఇదే బ్యాచ్ ఈటీవీలో ప్రారంభించారు. గ‌త కొంత కాలం క్రితం మొద‌లైన ఈ కామెడీ షోకు ఇంద్ర‌జ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోల ల కాకుండాఈ షోని కొంత భిన్నంగా డిజైన్ చేశారు.

గెస్ట్ ల‌ని పిల‌వ‌డం.. వారి ముందు టీమ్ మెంబ‌ర్స్ స్కిట్ లు పెర్ఫార్మ్ చేయ‌డం వంటి ఫార్మాట్ లో ఈ షోని ప్లాన్ చేశారు. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ త‌ర‌హాలోనే ఈ షో కూడా మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో దూసుకుపోతోంది. మంచి టీఆర్పీరేటింగ్ ని సొంతం చేసుకుంటూ జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ ల స‌ర‌స‌న నిల‌బ‌డింది. తాజాగా మే 1న ప్ర‌సారం కానున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు. టీమ్ మెంబ‌ర్స్ తో క‌లిసి సుడిగాలి సుధీర్‌, ఇంద్ర‌జ హ‌ల్ చ‌ల్ చేశారు. అయితే ఈ సంద‌ర్భంగా సుడిగాలి సుధీర్ త‌న‌ని తాను వేలానికి పెట్టుకోవ‌డం, ఏకంగా జ్యోతిని మ్యాజిక్ పేరుతో ఆట‌ప‌ట్టించ‌డం ఆక‌ట్టుకుంటోంది.

సుడిగాలి సుధీర్ త‌న‌ని తానే వేలాని పెట్టేసుకున్నారు. శ్రీ‌దేవి డ్రామా కంప‌నీ సాల‌రీల‌కు ఇబ్బంది అవుతుండ‌టంతో తాజాగా వేలం పాట‌కు సిద్ధ‌మైపోయారు. ఒక ఏడాది పాటు ఎవ‌రికైనా ఈ షోతో పాటు త‌న‌ని లీజుకి ఇచ్చేస్తే అంద‌రికి సాల‌రీలు వ‌చ్చేస్తాయ‌ని ఇంద్ర‌జ‌కు ఐడియా చెప్పాడు సుడిగాలి సుధీర్.. ఇప్ప‌టికిప్పుడు లీజ్ అంటే ఎవ‌రొస్తార‌ని అడ‌గ‌డంతో జ్యోతి, సాయికిర‌ణ్‌, విష్ణు ప్రియ‌, మ‌ధు ప్రియ ల‌ని పిలిచాడు. అంతే కాకుండా టీమ్ మెంబ‌ర్ లంద‌రిని పిలిచి మ‌న శ్రీ‌దేవి డ్రామా కంప‌నీని లీజుకు ఇచ్చేస్తున్నాన‌ని చెప్పేశాడు. సూప‌ర్ సూప‌ర్ అన్నందుకేనా ఇదంతా చేస్తున్నారంటూ సుడిగాలి సుధీర్‌పై వ‌ర్ష పంచ్ వేసింది. తాజా ప్రోమోలో ఏ ఒక్క‌రూ కూడా త‌గ్గేదేలే అనే స్థాయిలో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో మే 1 ఆదివారం మ‌ధ్యాహ్నం 1:00 ప్ర‌సాం కానుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.