English | Telugu

నెలకు 2 లక్షలు సంపాదించాలి...కాబోయే భర్త క్వాలిటీస్ గురించి చెప్పిన శ్రీనిధి

శ్రీనిధి శెట్టి రీసెంట్ టైమ్స్ లో ఫార్మ్ లోకి వచ్చిన హీరోయిన్. రీసెంట్ గా తెలుసు కదా అనే మూవీలో రాశిఖన్నాతో పాటు నటించింది. ఇక ఈమె ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి ఈ వీక్ వచ్చింది. అలాగే శ్రీనిధి తనకు కాబోయే ఫ్యూచర్ హజ్బెండ్ ఎలా ఉండాలో శ్రీముఖి ఇచ్చిన టాస్క్ లో చెప్పింది. "తెలుసుకోవాలి కదా" అనే గేమ్ లో అబ్బాయికి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పింది. అబ్బాయికి ఏజ్ వచ్చేసరికి మొదటి ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంది కానీ తర్వాత అసలు విషయం చెప్పింది. 30 - 40 మధ్యలో ఉండాలని చెప్పింది. అలాగే ఇక అబ్బాయి హైట్ 5 ' 8 కి మించి ఉండాలని చెప్పింది. ముద్దు పెట్టడానికి నుదురు అందేలా ఉంటే చాలు అని చెప్పింది. ఇక వెయిట్ వచ్చేసరికి 70 - 80 మధ్యన ఉండి ఫిట్ గా ఉండాలని అలాగే మంచి మనసు ఉండాలని చెప్పింది.

ఆస్తులు తనకు ఉన్నాయి కాబట్టి వచ్చే అబ్బాయికి ఆస్తులు అవసరం లేదు కానీ మంచి మనసు ఉండాలని చెప్పింది. ఇక అతను ఏ రంగానికి చెందకుండా నాన్-ఫేమస్ పర్సన్ అయ్యి ఉండాలని చెప్పింది. నెలకు 2 లక్షల సంపాదన ఉండడంతో పాటు ట్రావెలింగ్ చేయాలి అలాగే ఏదైనా స్పోర్ట్ లో ఇంటరెస్ట్ ఉండాలి ఇంకా ఇంట్లో ఇంట్లో ఉండి ఫుల్ ఛిల్ల్ అయ్యే పర్సన్ కావాలని చెప్పింది. ఇక అబ్బాయికి లైట్ గా గడ్డం ఉండాలని, మంచి స్మైల్ తో పాటు అందమైన కళ్ళు ఉండాలని కూడా చెప్పింది శ్రీనిధి. ఈమె మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి కేజిఎఫ్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే హిట్ 3 లో కూడా మంచి నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక ఈమె 2015 లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్స్ ని విన్ అయ్యింది. 2016 లో మిస్ సుప్రనేషనల్ టైటిల్ ని సొంతం చేసుకుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో శ్రీనిధి రాసిన ప్రతీ ఆన్సర్ కి ఎగబడి మరీ ఎక్కువ చేసిన అవినాష్ కి, హరికి మాత్రం ఫుల్ కౌంటర్లు ఇచ్చి కంట్రోల్ చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.