English | Telugu

బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీజ దమ్ము..కప్పు తెస్తాను అంటూ ఇన్స్టా పోస్ట్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష పూర్తయిపోయింది. ఇక ఇందులో శ్రీజ దమ్ము హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. "భవిష్యత్తులో ఏమి జరుగుతుందో నాకు తెలియదు కానీ బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో నాకు జీవితకాల జ్ఞాపకాలను ఇచ్చింది. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి అలాగే పాజిటివ్ , నెగెటివ్‌లు కూడా ఉన్నాయి.. కానీ ఇక్కడ జరిగిన ప్రతి క్షణాన్ని నా జీవితాంతం గుర్తుంచుకుంటాను. ఆ రోజు నాకు గ్రీన్ ఇచ్చి, ఎంతో మంది ఆశీస్సులు, ప్రేమను సంపాదించుకెనెకునేలా చేసిన నవదీప్ గారికి థాంక్యూ..ఆయనది మాస్టర్ మైండ్, ఆయనో ఎంటర్‌టైనర్, ఈ షోకి మెయిన్ రోల్ ఆయనే..శ్రీముఖి అక్కా, అసలు మీ శక్తి, మీ చురుకుదనం , మీరు మమ్మల్ని సపోర్ట్ చేసే విధానం వాహ్ అక్కా, వాహ్.. హ్యాండ్స్ డౌన్ ది బెస్ట్ హోస్ట్...ఇక బిందు మాధవి గారూ, ఆడపులి అంతే!!!! ఆమె మాట్లాడే విధానం, ఆమె ప్రోత్సహించే విధానం ..బ్యూటీ విత్ బ్రెయిన్. ఫైనల్ గా అభిజిత్ గారూ, విన్నర్ అంటే..ఆయన పరిశీలనా విధానం బాగుంది. తక్కువగా మాట్లాడడం ఏదైనా చేసి చూపించడం చేస్తారు. అతను ఎం మాట్లాడినా కన్ఫర్మ్ గా దానికి ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడతారు. అలాగే ఈరోజు వరకు నాకు సపోర్ట్ చేస్తూ ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా థాంక్యూ సో మచ్ అందరికి...ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా...మీ శ్రీజ దమ్ము కప్ తీసుకువస్తుంది ఈసారి" అంటూ అగ్నిపరీక్షలో తన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మెసేజ్ చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.