English | Telugu

కళాపోషణకు ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు!


శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం మస్త్ కామెడీని పండించింది. చిన్నప్పుడు చెంబు పట్టుకుని తప్పిపోయిన కొడుకును, కూతురిని వెతుక్కుంటూ కృష్ణ భగవాన్ ఈ షోకి జడ్జిగా వస్తాడు. అతని పనోడి క్యారెక్టర్ లో బాబా భాస్కర్ నటించాడు. కొడుకుల్ని కనిపెట్టాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళను పిలిస్తే చాలు అంటాడు భాస్కర్. నా పిల్లలు దొరికితే నా ఆస్తి యావత్తు ఇచ్చేస్తాను అని చెప్తాడు కృష్ణ భగవాన్ అలా చెప్పేసరికి యావత్తు అంటే బి.పి ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లా అని అడుగుతాడు. ఆ డైలాగ్ కి కృష్ణ భగవాన్ మళ్ళీ వేసావా పంచి అని అంటాడు .

అంటే ఇంతకుముందు పద్మకి వర్షకి ఆస్తి కొంత ఇచ్చేసా కదా ఇప్పుడు నా పిల్లలు వస్తే మిగతాది ఇచ్చేద్దామని అనేసరికి పద్మకి వర్షకి ఎం ఇచ్చారు అంటాడు భాస్కర్. ఆస్తిలే గాని కాస్త కళాపోషణ ఉండాలి అంటాడు భాస్కర్ తో. ఈ వయసులో కళాపోషణ ఏంటండీ నవ్వుతారు ఊరుకోండి అంటాడు. కళాపోషణకి ఎక్సపైరీ డేట్ లేదు అనేసరికి అందరూ నవ్వేస్తారు. పిల్లలు ఎలా వెళ్లిపోయారు చెప్పండి అని భాస్కర్ అడుగుతాడు. చెంబు తీసుకుని కొడుకు వెళ్ళిపోయాడు తన చెంబు వెతుక్కుంటూ కూతురు కూడా వెళ్లిపోయిందని చెప్పేసరికి భాస్కర్ షాక్ అవుతాడు.

తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఇంద్రజని, రష్మిని పిలిపించి తన పిల్లలని వెతికే పని అప్పజెబుతాడు కృష్ణ భగవాన్. ఇలా ఈ వారం పంచ్ డైలాగ్స్ తో ఈ షో నడిచింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.