English | Telugu

హౌస్ నుంచి శ్రీ‌రామ‌చంద్ర కూడా వ‌చ్చేశాడు! క‌న్నీరు పెట్టిన అమ్మ‌!!

ఐదుగురు ఫైన‌లిస్టుల్లో మొద‌ట సిరి, త‌ర్వాత మాన‌స్‌ ఎలిమినేట్ అయ్యాక మిగిలిన ముగ్గురిలో ఎవ‌రు ముందుగా ఎలిమినేట్ అవుతారా అని వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, ఎక్స్ కంటెస్టెంట్స్‌తో పాటు వీక్ష‌కులు ఆత్రుత‌గా ఎదురుచూస్తుండ‌గా, శ్రీ‌రామ‌చంద్ర ఎలిమినేష‌న్‌కు గురై, హౌస్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. అత‌డిని హౌస్ నుంచి హీరో నాగ‌చైత‌న్య‌ తీసుకువ‌చ్చాడు. ఆడియెన్స్ పోల్ ప్ర‌కారం టాప్ 3 ఫైన‌లిస్టుల్లో ముందుగా ఎలిమినేట్ అయిన ఒక‌రిని హౌస్ నుంచి బ‌య‌ట‌కు తెచ్చే బాధ్య‌త‌ను చైతూకు అప్ప‌గించారు హోస్ట్ నాగార్జున‌.

Also read:నా దునియాల నేను హీరోనే: స‌న్నీ

హౌస్‌లోకి త‌న‌తో ఒక గోల్డ్ బాక్స్‌ను కూడా త‌న‌తో తీసుకువెళ్లాడు చైతూ. ముగ్గురిలో ఎవ‌రైనా ఆ గోల్డ్ బాక్స్‌ను తీసుకొని హౌస్ నుంచి త‌న‌తో పాటు బ‌య‌ట‌కు రావ‌చ్చ‌నీ, అందులో అప్పుడు ఎలిమినేష‌న్‌కు గుర‌య్యే వారికి ఇచ్చే డ‌బ్బు కంటే మూడు రెట్లు ఎక్కువ అమౌంట్ అందులో ఉంద‌నీ, దానితో అదృష్ట‌వంతుడు కావ‌చ్చ‌నీ అత‌ను ఆఫ‌ర్ చేశాడు. కానీ ఆ ముగ్గురిలో ఎవ‌రూ ఆ బాక్స్‌ను అందుకోవ‌డానికి ముందుకు రాలేదు. వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ని కూడా నాగ్ అడిగాడు. వారు కూడా బాక్స్ తీసుకోవ‌డం ఇష్టంలేద‌నీ, చివ‌రిదాకా పోటీలో త‌మ పిల్ల‌లు నిల‌వాల‌నుకుంటున్నామ‌నీ చెప్పారు.

Also read:నిన్న‌టి వ‌ర‌కు సిరి ఫ్రెండ్.. కానీ ఇప్ప‌డు పెళ్లాం?

అప్పుడు నాగ్ వారికి ఓ టాస్క్ ఇచ్చాడు. త‌న ద‌గ్గ‌ర స్టేజ్ మీదే మూడు బిందెల‌ను ఏర్పాటుచేసి, వాటిలో ఒక స్పిరిట్ లాంటిది పోశాడు. ఆ బిందెల్లోంచి పొగ‌లు వ‌స్తుండ‌గా, ఆ మూడింటిలో రెడ్ క‌ల‌ర్ వ‌చ్చిన‌వాళ్లు ఎలిమినేట్ అయిన‌ట్ల‌ని నాగ్ చెప్పాడు. స‌న్నీ, ష‌ణ్ణు బిందెల ద‌గ్గ‌ర గ్రీన్ లైట్‌, శ్రీ‌రామ‌చంద్ర బిందె ద‌గ్గ‌ర రెడ్ లైట్ వెలిగింది. దాంతో అత‌ను ఎలిమినేట్ అయిన‌ట్లు నాగ్ అనౌన్స్ చేశారు. శ్రీ‌రామచంద్ర‌ను తీసుకొని చైతూ బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అలా టాప్ 3 ఫైన‌లిస్టుగా బిగ్ బాస్ హౌస్‌లో శ్రీ‌రామ‌చంద్ర జ‌ర్నీ ముగిసింది. బ‌య‌ట‌కు వ‌చ్చాక, నాగ్‌ను క‌లిసిన అత‌ను పెద‌వే ప‌లికిన మాట‌ల్లోన తియ్య‌ని మాటే అమ్మ పాట ఆల‌పించాడు. అత‌డు పాడుతున్నంత సేపూ వాళ్ల‌మ్మ ఉబికివ‌స్తున్న క‌న్నీటిని తుడుచుకుంటూనే ఉంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.