English | Telugu

అభిమానుల‌కు షాక్‌.. శ్రీ‌ముఖి మ‌ళ్లీ బిస్కెట్ వేస్తోందా?

అభిమానుల‌కు శ్రీ‌ముఖి మ‌రోసారి బిస్కెట్ వేస్తోందా? అంటే అవున‌నే అనిపిస్తోంది అంటున్నారు ఆమె ఫ్యాన్స్‌. తాజాగా `క్యాష్` ప్రోగ్ర‌మ్ లో పాల్గొన్న శ్రీ‌ముఖి మ‌ళ్లీ పెళ్లి టాపిక్ ఎత్తుకుంది. ఈటీవిలో `ప‌టాస్‌` త‌ర‌హాలోనే డిజైన్ చేసిన షో `జాతిర‌త్నాలు`. ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌ముఖి ప్ర‌స్తుతం యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌నిస్తోంది. అయితే త‌న టీమ్ తో క‌లిసి శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా `క్యాష్‌` షో కోసం సుమ‌తో క‌లిసి స్పెషల్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా త‌న `జాతిర‌త్నాలు` టీమ్ ని ప‌రిచ‌యం చేసిన శ్రీ‌ముఖి మ‌ళ్లీ త‌న ప్రేమ, పెళ్లిగోల‌ని మొద‌లుపెట్టింది.

`నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్లు అయిన‌ప్ప‌టికీ.. ఎంతో మంది అంద‌మైన హీరోలు, కో - యాక్ట‌ర్ ల‌తో వ‌ర్క్ చేసిన‌ప్ప‌టికి ఎవ్వ‌రికీ నా మ‌న‌సు ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి చేసుకోకుండా నా మెడ‌లో మూడు ముళ్లు ప‌డ‌కుండా ఉండ‌టానికి కార‌ణ‌మైన ఏకైక వ్య‌క్తి ఎవ‌రో కాదు..` అంటూ త‌న మ‌న‌సు దోచిన ప్రియుడి ని ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నం చేసింది. శ‌నివారం రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న `క్యాష్` స్పెష‌ల్ ఎపిసోడ్ కి సంబంధించిన ఈ ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఈ ఈవెంట్ ద్వారా శ్రీ‌ముఖి త‌న కు కాబోయే వ‌రుడిని నిజంగానే ప‌రిచ‌యం చేయ‌బోతోందా? లేక ప్రోమో కోస‌మే అలా చెప్పిందా? అన్న‌ది తెలియాలంటే శ‌నివారం రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం అయ్యే `క్యాష్` ఎపిసోడ్ చూడాల్సిందే. గ‌త కొంత కాలంగా శ్రీ‌ముఖి ల‌వ్ లో వుందంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి. అయితే ఈ వార్త వైర‌ల్ అయిన ప్ర‌తీ సారి అలాంటిది ఏమీ లేద‌ని కొట్టి పారేస్తూ వ‌స్తున్న శ్రీ‌ముఖి ఇటీవ‌ల ఇది త‌న వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని, దీన్ని ఇంత‌టితో వ‌దిలేయండ‌ని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా `క్యాష్‌` ప్రోమోలో మాత్రం త‌ను ఇప్ప‌టికి పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి ఓ వ్య‌క్తి కార‌ణం అంటూ బాహాటంగానే బ‌య‌ట‌పెట్ట‌డం.. ఆ వ్య‌క్తి పేరుని బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే శ్రీ‌ముఖి త‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌నుకున్న వ్య‌క్తి ఎవ‌రో ఈసారైనా బ‌య‌ట‌పెడుతుందో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.