English | Telugu

శ్రీముఖికి డాక్టర్ బాబుతో పెళ్లెప్పుడయ్యిందబ్బా..?

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో శ్రీముఖి కాస్ట్యూమ్ వేరే లెవెల్ లో ఉంది. అలాగే ఇందులో పెళ్లి జోక్స్ బాగా ఎక్కువగా వినిపించాయి. శ్రీముఖి పెళ్లి చేసుకుంటే చూడాలని ఆడియన్స్, ఫాన్స్ అనుకుంటున్నారు. కానీ ఆ వరుడు ఎక్కడున్నాడో మాత్రం ఇంకా తెలీడం లేదు.

ఇక ఈ షోకి కార్తీక దీపం, నువ్వు నేను ప్రేమ టీమ్స్ వచ్చారు. ఇందులో కార్తీక దీపంలో ఉండే పాప కాస్ట్యూమ్ శ్రీముఖి కాస్ట్యూమ్ ఒకటే అయ్యేసరికి "మనిద్దరం తల్లిబిడ్డల్లా ఉన్నాం" అంది శ్రీముఖి. దానికి అవినాష్ "నేనే మీ నాన్న" అని ఓవర్ యాక్షన్ చేసాడు. తర్వాత డాక్టర్ బాబుని చూసి "ఏంటి ఈసారి దీపాతో రాకుండా ఈ పీపాతో వచ్చావ్" అని సెకండ్ హీరోయిన్ తో వచ్చిన డాక్టర్ బాబును అడిగింది. ఐతే "ఆ అమ్మాయి ఈ షోకి రావాలని ఆశ పడుతోందని అందుకే తెచ్చానని" చెప్పాడు డాక్టర్ బాబు. వెంటనే శ్రీముఖి డాక్టర్ బాబు చెయ్యి పట్టుకుని "అమ్మా నాకు ఈ అబ్బాయి నచ్చాడు..నువ్వు ఊ అంటే పెళ్లి చేసుకుంటా" అని సీరియల్ లో పారిజాతం రోల్ లో నటించిన నట కుమారితో చెప్పింది. "ఇక్కడ పారిజాతం మాటే నెగ్గాలి" అంది సీరియస్ గా "అమ్మా మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపం" అని డాక్టర్ బాబుతో ప్రేమాయణాన్ని వాళ్లకు పుట్టిన ఆ పిల్లను కూడా చూపించి కాసేపు ఫన్ చేసింది. శ్రీముఖి డైలాగ్ తో డాక్టర్ బాబు షాకయ్యాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.