English | Telugu

బిగ్ బాస్ లోకి సోనియా రీఎంట్రీ ఇవ్వనుందా?

బిగ్ బాస్ సీజన్లో అడుగుపెట్టిన ప్రతీ కంటెస్ట్ కూడా డిఫరెంట్ మైండ్ సెట్ తో ఉంటారు. తమకంటు ఒక ప్రపంచం ఉంటుంది. అది వదిలి బిగ్ బాస్ గూటిలో తమ ఇష్టాల్ని, అభిరుచులని వదిలి పెట్టి ఫేక్ గా ఉంటారు. కొన్ని సందర్భాల్లో తమ వర్జినాలిటి బయటకు వస్తుంది. ఆ క్యారెక్టర్ ని ప్రేక్షకులు ఆక్సెప్టు చెయ్యొచ్చు.. చెయ్యకపోవచ్చు.. చేయకపోతే మాత్రం బిగ్ బాస్ నుండి బట్టలు సర్దుకొని వచ్చేయ్యాల్సిందే. అలా వచ్చిన వారిలో సోనియా ఆకుల ఒకరు. ఎవరు ఉహించని విధంగా నాల్గవ వారంలో హౌస్ నుండి బయటకు వచ్చేసింది.

సోనియా హౌస్ లో వావ్ అనే పర్ఫార్మన్స్ ఇవ్వకపోయినా.. ఇన్ని రోజులు బ్యాక్ బిచింగ్ చేస్తూ అందరి దృష్టిలో నెగెటివ్ గా మారిపోయింది. ఎప్పుడు నిఖిల్ పృథ్వీలతో ఉంటూ హగ్ ల రాణి గా ట్రోలర్స్ కి స్టఫ్ అయింది. తను పృథ్వీ, నిఖిల్ తో చేసినవన్నీ చూసిన కొందరు ఆర్య-3 ని తియ్యొచ్చు అన్న కామెంట్స్ చేశారు. ఇక సోనియా హౌస్ లో నుండి బయటకు రావడానికి ప్రధాన కారణం హౌస్ లో ఎంతమంది అమ్మాయిలున్నా వాళ్ళతో కాకుండా ఆ ఇద్దరితో ఉండడం వళ్లే.. హౌస్ లో అమ్మాయిలకి నెగెటివ్ అయిందని చెప్పొచ్చు. సోనియా ఎలిమినేట్ అయ్యాకా కూడ హౌస్ లో ఇప్పుడు చాలా రిలీఫ్ అయిందని విష్ణుప్రియ, కిర్రాక్ సీత అనుకున్నారు. కొందరైతే సోనియాని హౌస్ లో గుంట నక్క అని అంటారు. గత సీజన్లో రతికకి సిస్టర్ లా కన్పించే ఈ సోనియా రతికలాగే మళ్ళీ బిగ్ బాస్ లోకి రీఎంట్రీ ఇస్తుందంటు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదే నిజం అయితే బిగ్ బాస్ సీజన్-8 నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.

ఇప్పటికే పన్నెండు మంది హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ అని నాగార్జున చెప్పనే చెప్పాడు. అందులో చాలా మంది నేమ్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో సోనియా కూడా ఒకరు. సోనియా రీఎంట్రీ ఇస్తే మళ్ళీ తన ఆటని చేంజ్ చేసుకుంటుందో లేదో మళ్ళీ ఆర్య-3 ని కంటిన్యూ చేస్తుందో చూడాలి మరి. హౌస్ లో ఉన్న వారి గురించి పూర్తిగా తెలుసుకొని ప్రేక్షకలు ఏం అనుకుంటున్నారో అన్ని పూర్తిగా తెలుసుకొని హౌస్ లోకి వస్తుంది. కాబట్టి కచ్చితంగా తన ఆటలో మార్పు వస్తుందో లేక రతిక రీఎంట్రీ ఇచ్చాక రెండో వారంలో బయటకు వచ్చినట్లే సోనియా కూడా రీఎంట్రీ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తుందో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.