English | Telugu

సోనియా రీఎంట్రీ కన్ఫమ్.. అడ్డుపడుతున్న తల్లిదండ్రులు!

బిగ్ బాస్ సీజన్-8 లో నెగెటివిటి ఎక్కువగా సంపాదించుకున్నవారిలో సోనియా ఒకరు. పృథ్వీ, నిఖిల్ లని తన మాటతో మార్చేసిన సోనియా వరెస్ట్ గేమర్ గా బయటకొచ్చింది. అయితే సోనియా ఎలిమినేషన్ కి రెండు వారాల ముందు నుండి తను ఎలిమినేట్ అవ్వాలని మొత్తం సోషల్ మీడియా కోరుకుంది. అలాగే తను ఎలిమినేషన్ అయ్యాక చాలామంది హ్యాపీగా ఉన్నామంటూ కామెంట్లు కూడా చేశారు.

బిగ్‌బాస్ హౌస్‌లోకి సోనియా ఆకుల రీఎంట్రీ ఇవ్వబోతుందనే న్యూస్ వైరల్ అవుతోంది. అయితే చాలా మంది ఇది రూమర్ మాత్రమేనని.. సోనియా వచ్చే అవకాశం లేదంటూ కొట్టిపారేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం సోనియా రీఎంట్రీ ఆల్ మోస్ట్ కన్ఫమ్ అయిపోయిందంట. అంతేకాకుండా ఆమె ఎప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతుందనే అప్డేట్ కూడా వచ్చేసింది. బయటకొచ్చాక నాగార్జున , బిగ్ బాస్ కలిసి తనని నెగెటివ్ గా చూపించారంటూ ఇంటర్వ్యూలలో చెప్పిన సోనియా బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ రాబోతుంది.

సోనియా రీఎంట్రీ ఆల్‌మోస్ట్ కన్ఫమ్ అయింది. ఇప్పటికే బిగ్‌బాస్ టీమ్ సోనియాను సంప్రదించారని‌ తెలుస్తోంది. అయితే రీఎంట్రీ ఇవ్వాలా అనే విషయంపై సోనియా క్లారిటీ ఇవ్వలేదంట. ఎందుకంటే సోనియా మరోసారి బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని.. అందుకే సోనియా కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సోనియాతో రీఎంట్రీ ఇప్పించేందుకు బిగ్‌బాస్ టీమ్ ట్రై చేస్తుందట. అన్నీ కుదిరితే ఎనినిదో వారం చివరిలో సోనియా హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వొచ్చని తెలుస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.