English | Telugu

ష‌ణ్ముఖ్‌కు షాకిచ్చిన సిరి మ‌ద‌ర్‌

బుల్లితెర‌ రియాలిటీ షో బిగ్‌బాస్ విమ‌ర్శ‌ల మ‌ధ్య చివరి అంకానికి చేరుకుంటోంది. కంటెస్టెంట్స్ ప‌రంగానూ, హోస్ వ్య‌వ‌హార శైలి ప‌రంగానూ వివాదాల్లో చిక్కుకుండా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ఈ షో తాజాగా కంటెస్టెంట్‌ల పేరెంట్స్ కార‌ణంగానూ వివాద‌స్ప‌ద‌మ‌వుతోంది. హౌస్‌లో ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయిన కంటెస్టెంట్‌ల‌ని ప‌క్క‌న పెడితే ఈ వారం ఎలిమినేష‌న్‌లో మొత్తం ఎనిమిది మంది స‌భ్యులున్నారు.

ష‌న్ను కెప్టెంన్ అయ్యాడు. ఈ నేప‌థ్యంలో హౌస్ మేట్స్‌కి వారి పేరెంట్స్‌, బంధువుల‌ని క‌లిపించే కార్య‌క్ర‌మాన్ని బిగ్‌బాస్ బుధ‌వారం మొద‌లుపెట్టారు. ఇందులో భాగంగా బుధ‌వారం కాజ‌ల్ భ‌ర్త‌, కూతురు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి కాజ‌ల్‌ని స‌ర్‌ప్రైజ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. తాజాగా గురువారం మ‌రో ఇద్ద‌రు కంటెస్టెంట్‌లకు సంబంధించిన పేరెంట్స్ రాబోతున్నారు. ముందుగా మాన‌స్ మ‌ద‌ర్ హౌస్‌లోకి రాబోతోంది. ఆ త‌రువాత సిరి మ‌ద‌ర్ ఎంట్రి ఇస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రోమోని బిగ్‌బాస్ తాజాగా విడుద‌ల చేశారు.

ఈ వీడియోలో మాన‌స్ తల్లి కంటెస్టెంట్‌ల‌తో క‌లిసి అల్ల‌రి చేయ‌గా.. సిరి త‌ల్లి రావ‌డం రావ‌డ‌మే ష‌న్నుపై త‌న ఆగ్ర‌హాన్ని చూపించింది. సిరి బాగా ఆడుతోంద‌ని చెప్పిన ఆమె త‌న‌కు ష‌న్ను స‌పోర్ట్ చేస్తున్నాడ‌ని, అయితే త‌న‌ని ప్ర‌తీసారి సిరి హ‌గ్ చేసుకోవ‌డం త‌న‌కు న‌చ్చ‌డం లేద‌ని ష‌న్ను ముఖం మీదే చెప్పేసి షాకిచ్చింది. త‌న‌కు సిరి బాగా ద‌గ్గ‌రైపోతోంద‌ని, అది త‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌డం లేద‌ని చెప్పేయ‌డంతో ష‌న్ను ముఖం ఒక్క‌సారిగా వాలిపోయింది. తాజా ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.