English | Telugu

సిరికి ద‌క్కింది ఎంతో తెలుసా?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 మొత్తానికి ముగిసింది. ఈ సీజ‌న్‌లో అంతా ఊహించిన‌ట్టుగానే వీజే స‌న్నీ విజేత‌గా నిలిచాడు. క‌ప్పు ముఖ్యం బిగులూ అంటూ గ‌త కొన్ని వారాలుగా సంద‌డి చేసిన స‌న్నీ అన్న‌ట్టుగానే క‌ప్పు ని ద‌క్కించుకున్నాడు. ఈ సంద‌ర్భంగా అత‌నికి ప్రైజ్ మ‌నీ కింద భారీ మొత్తమే ద‌క్కింది. విజేత‌గా 50 ల‌క్ష‌ల ప్ర‌నైజ్ మ‌నీన‌ని సొంతం చేసుకున్న స‌న్నీ 15 వారాల‌కు గానూ మ‌రో 25 ల‌క్ష‌లు.. సువ‌ర్ణ కుటీర్ వారు అందించే 300 గ‌జాల ఫ్లాట్.. టీవీఎస్ బైక్ ల‌ని ద‌క్కించుకుని దాదాపు కోటికి మించి అందుకున్నాడు.

దీంతో ఫైన‌ల్ వ‌ర‌కు వున్న వారు ఎంత గెలుచుకుని వుంటార‌నే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. స‌న్నీ బిగ్‌బాస్ ట్రోఫీతో పాటు 50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీని, 300 గ‌జాల ఫ్లాట్ ని ద‌క్కించుకోవ‌డ‌మే కాకుండా టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ తో పాటు 15 వారాల‌కు గానూ 25 ల‌క్ష‌ల‌ని కూడా ద‌క్కించుకుని అంద‌రికి షాకిచ్చాడు. గ‌త సీజ‌న్ కంటెస్టెంట్ ల‌తో పోలిస్తే స‌న్నీ భారీగా సొంతం చేసుకోవ‌డంతో ఇత‌ర స‌భ్యుల ప‌రిస్థితి ఏంట‌నే చ‌ర్చ మొద‌లైంది.

చివ‌రి వ‌ర‌కు నిలిచిన టాప్ 5లోని కంటెస్టెంట్ ల గురించి ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతోంది. వీరికి 15 వారాల‌కు గాను ద‌క్కింది ఎంత అన్న‌ది ఇప్పుడు హాట్ న్యూస్‌. చివ‌రి వ‌ర‌కు నిలిచిన వ్య‌క్తులు శ్రీ‌రామ‌చంద్ర‌, మాన‌స్ , సిరి. ఈ ముగ్గురిలో సిరి సొంతం చేసుకున్న రెమ్యున‌రేష‌న్ బ‌య‌టికి వ‌చ్చింది. గ్రాండ్ ఫినాలే ప్రారంభం కాగానే ముందు ఎలిమినేట్ అయిన వ‌క్తి సిరి. ఆమెకు 15 వారాల‌కు గాను 25 ల‌క్ష‌లు ద‌క్కిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. వారానికి 1.5 ల‌క్ష‌ల నుంచి 2 ల‌క్ష‌ల వ‌ర‌కు పారితోషికంగా నిర్ణ‌యించాయ‌ర‌ట‌. ఆ లెక్కల ప్ర‌కారం సిరికి 25 ల‌క్ష‌లు ద‌క్కింద‌ని చెబుతున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.