English | Telugu

Shekhar basha: ఇంటికెళ్తే నా భార్య ఎందుకొచ్చావ్ వెళ్ళిపో అంది!

బిగ్ బాస్ సీజన్-8 లో తన ఆణిముత్యాలతో నెటిజన్లకి కంటెంట్ ఇచ్చిన కంటెస్టెంట్ శేఖర్ బాషా ( Shekhar baasha). బిగ్ బాస్ హౌస్ లో నాన్ సింక్ పంచ్ లతో క్రేజ్ ని తెచ్చుకున్నాడు.. బెస్ట్ వ్యూ అంటే ' ఐ లవ్ య్యూ', చిరాకు అంటే ఛీ రాకు అని ఇలా శేఖర్ బాషా చెప్పిన ఒక్కో డైలాగ్ ఒక్కో డైమండ్ గా నిలిచాయి. మరికొన్ని రోజులు హౌస్ లో ఉంటే ఇంకా క్రేజ్ వచ్చేది కానీ రెండో వారం హౌస్ మేట్స్ చేత ఎలిమినేట్ అయ్యాడు.

హౌస్ నుండి బయటకొచ్చాక తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ బాషా కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నాడు. తన భార్య డెలివరీ ముందు మూడు రోజుల వరకు తనకి ఒకటే టెన్షన్ అని , అందుకే ఎలిమినేషన్ అయి బయటకొచ్చానని శేఖర్ బాషా చెప్పాడు. ఇక ఇంటికెళ్తే నా భార్య ఎందుకొచ్చావ్ వెళ్ళిపోమని అంది. కనీసం నువ్వు టాప్-5 లో ఉంటావని అనుకున్నా కానీ ఇలా చేశావేంటని అంది. నా బాబుని ఎత్తుకున్న ఆ సంతోషం చాలు అని అనుకున్నా కానీ నేను ఎలిమినేట్ అయ్యానని తెలిసి తను ఏడ్చేసిందంట అని శేఖర్ బాషా చెప్పుకొచ్చాడు. వాళ్ళెలా అనుకున్నా , బిడ్డని ఎత్తుకోవాలనుకున్నాను.. తన పక్కనున్నాను.. హ్యాపీ. బిగ్ బాస్ కి వెళ్ళడం కోసమే ఇలా రాజ్ తరుణ్ ఇష్యూలో దూరవని కొంతమంది అన్నారు నిజమేనా అని అడుగగా.. అదేం లేదు. నేను వెళ్తానో లేదో అనే క్లారిటీ కూడా లేదు. డెలివరీ దగ్గర్లో ఉంది వెళ్ళాలా వద్దా అని నా భార్యని అడిగినప్పుడు.. తను ఓ రోజంతా ఆలొచించుకొని వెళ్ళమని చెప్పింది. వారం రోజుల ముందు వరకు అసలు తెలియదు.. బిగ్ బాస్ టీమ్ చేసిన ఇంటర్వ్యూలో.. నా భార్య డెలివరీకి వన్ డే పర్మిషన్ కావలి లేదా చూపించాలి అన్నాను‌‌.. వాళ్ళు ట్రై చేస్తామని చెప్పారంటు శేఖర్ బాషా చెప్పుకొచ్చాడు.

హౌస్ లో నీకు ఫుడ్ ఎలా ఉండేదని అడుగగా.. అందరు నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు.. నేను ఒక్కడినే వెజిటేరియన్.‌ వాళ్ళు ఎగ్ బుజ్జి చేసుకుంటే నాకు సపరేట్ గా చేయమని చెప్పలేక ఒక్కో రోజు క్యాబేజీ ముక్కలు, క్యారెట్ ముక్కలు తినేవాడిని. విటమిన్ పౌడర్ ఉండేది‌ కాబట్టి సరిపోయేది కానీ బిగ్ బాస్ వాళ్ళు అవి కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుండి డౌన్ అయిపోయానని శేఖర్ బాషా అన్నాడు. మరి ఫుడ్ లేకుండా ఎలా ఉండేదని అడుగగా.. అందరికి ఎగ్ ఉంది కానీ నాకే సిగ్గు లేదంటూ శేఖర్ బాషా చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలని షేర్ చేసుకున్నాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.