English | Telugu

ఫిదా మూవీలో సాయి పల్లవి కి డబ్బింగ్...ఆ బాడ్కోని నేనే 


జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో భలే ఫన్నీగా ఉంది. శివాజీ రావడమేమో కానీ కమెడియన్స్ లో నిద్రపోతున్న జోష్ ని నిద్రలేపాడు. దాంతో వాళ్ళు కామెడీ స్కిట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ఈ షోలో తాగుబోతు రమేష్ తనను తాను తిట్టుకున్నాడు. ఎందుకంటే సాయి పల్లవి అంటే తనకు ఎంతో ఇష్టమట. ఎంత అందంగా ఉంటది..ఫిదా సినిమాలో "బాడ్కో బలిసిందారా" అంటది కదా ఆ బాడ్కోని నేనే" అంటూ తెగ సంబరపడిపోతూ ఏంటేంటో వాగేశాడు. ఈ స్కిట్ ఇలా ఉండబోతుంటే బులెట్ భాస్కర్- రష్మీ కలిసి ఒక స్కిట్ వేశారు "బయట వర్షం వస్తుంది జాగ్రత్త" అంటాడు భాస్కర్.

"అయ్యో నాకు జలుబు, జ్వరం వస్తుందనగా" అని ఆతృతగా అడుగుతుంది. "కాదమ్మా " అని బులెట్ భాస్కర్ చెప్పగానే "మేకప్ పోతుందేమో అని" అంటూ ఆ వాక్యాన్ని జడ్జ్ శివాజీ ఫిల్ చేసాడు. దాంతో రష్మీ ఫీలైపోయింది. ఇక శివాజీ షో స్టార్టింగ్ లో రాకెట్ రాఘవను అస్సలు మాట్లాడనివ్వకుండా చాలా హడావిడి చేసాడు. దాంతో రాఘవా పాపం చాలా ఫీలైపోయాడు. ఇక ఈ షోకి హీరోయిన్ ఫారియా, శ్రీ సింహ వచ్చారు. వాళ్ళ మధ్యలో నిలబడి డాన్స్ చేసేసరికి శివాజీ గట్టిగా ఒక కామెంట్ చేసాడు. వాళ్ళ మధ్య నువ్వెంత పొట్టిగా ఉన్నవో తెలుసా అన్నాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.