English | Telugu

అఖిలే నెం.1.. హ‌గ్గంటే పారిపోయిన షణ్ముఖ్‌


బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫినాలే ముందు వారంలో జ‌రుగుతున్న `టికెట్ టు ఫినాలే` టాస్క్ మొద‌లైన విష‌యం తెలిసిందే. ఇది మంచి ర‌స‌ప‌ట్టుగా సాగుతోంది. యాంక‌ర్ ర‌వి, మాన‌స్‌, సిరి హ‌న్మంత్‌, తాజాగా ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసి చేయాల్సిన ర‌చ్చ చేస్తున్నారు. ఇప్ప‌టికే యాంక‌ర్ ర‌వి, మాన‌స్‌, సిరి హ‌న్మంత్ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ అంటూ భౌస్ లోకి వచ్చి వెళ్లారు. తాజాగా యూట్యూబ‌ర్ ష‌ణ్మ‌ఖ్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఆట దాదాపు క్లైమాక్స్ కు చేరుకుంది. అంతా స‌ర‌దా మోడ్ లోకి వ‌చ్చేశారు.

సూర్య పాట‌కు స్టెప్పులేస్తూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ష‌ణ్ముఖ్ మోజ్ రూం చూసి ఒక్క‌సారిగా షాక్ అయ్యాడు. అందులోకి వెళ్ల‌మ‌ని అరియానా అడిగితే వామ్మో నేను వెళ్ల‌నంటూ వెన‌క్కి వ‌చ్చేశాడు. ఆ త‌రువాత ఇంటి స‌భ్యుల గురించి మాట్లాడుతూ హౌస్ లో నిత్యం గొడ‌వ‌ప‌డుతున్న అఖిల్‌, బిందుల గురించి చెప్ప‌డం మొద‌లు పెట్టాడు. బ‌య‌టికి వెళ్లాక అఖిల్ , బిందు క‌ల‌వ‌లేర‌ని ష‌ణ్ముఖ్ పంచ్ వేయ‌డంతో లేదు లేదు క‌లుస్తాం అని చెప్పాడు అఖిల్. బిందు కూడా క‌లుస్తాం అని చెప్పింది. ఇక ఇంటి స‌భ్యుల పాజిటివ్ పాయింట్స్ గురించి అషురెడ్డి అడ‌గ‌డంతో ఒక్కొక్క‌రి గురించి చెప్ప‌డం మొద‌లు పెట్టాడు.

ముందు గా అఖిల్ గురించి మాట్లాడుతూ త‌నే ఫ‌స్ట్ అనేశాడు. బిందు గారు లేడీ టైగ‌ర్ లేడీ టైగ‌ర్ అంటే బ‌య‌ట‌కు వెళ్లిన త‌రువాత తెలుస్తుంద‌ని పంచ్ వేశాడు. శివ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆడుతున్నాడు. ఒక్క నోటిదూల త‌గ్గించుకుంటే మ‌రింత గ‌ర్వంగా వుంటుందన్నాడు. మిత్రా నాకు ఇదంతా ముందే తెలుస‌ని గేమ్ బాగా ఆడుతున్నార‌ని చెబుతుంటే హ‌గ్ కోసం వెళ్లింది. దీంతో షాకై సిరిని కార‌ణంగా బ్యాడ్ అయిన విష‌యాన్ని గుర్తు చేసుకున్న ష‌న్ను ప్లీజ్ నాకు హ‌గ్ వ‌ద్దు.. ఈ బిగ్ బాస్ లో హ‌గ్ లు వ‌ద్దురా బాబోయ్ అంటూ దండం పెట్టాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.