English | Telugu

దీప్తితో పెళ్లికి షణ్ముఖ్ తల్లి గ్రీన్ సిగ్నల్!

యూట్యూబ్ జోడీల్లో షణ్ముఖ్ జస్వంత్, దీప్తీ సునైనలకు అభిమానులున్నారు. పాటల్లో వీళ్ళిద్దరి రొమాన్స్, కెమిస్ట్రీ బాగుంటుంది. దాంతో పెయిర్ హిట్ అయ్యింది. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలామంది ఫీలింగ్. షణ్ముఖ్ 'బిగ్ బాస్'కు వెళ్ళిన తర్వాత అతడిపై ప్రేమను దీప్తీ సునైన పలు విధాలుగా బయట పెడుతోంది. షణ్ముఖ్ పుట్టినరోజున 'బిగ్ బాస్' హౌస్ బయట ఉన్న బిల్డింగ్ మీదకు వెళ్లి గట్టిగా 'ఐ లవ్యూ' అని అరిచింది. ప్రపోజల్ వీడియో 'బిగ్ బాస్' ఇంటిలో ఉన్న షణ్ణుకు పంపింది.

షణ్ముఖ్ జస్వంత్, దీప్తీ సునైన ప్రేమలో ఉన్నారని చెప్పడానికి బోలెడు సంఘటనలు కనపడతాయి. బహుశా... అవేవీ షణ్ముఖ్ తల్లి ఉమారాణికి కనిపించలేదేమో! దీప్తి, షణ్ణు ప్రేమలో ఉన్నట్టు తనకు తెలియదని చెప్పారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు మాత్రమేనని వివరించారు. ఒకవేళ వాళ్ళిద్దరికి ఒకరంటే మరొకరికి ఇష్టమైతే పెళ్ళి చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, దీప్తి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి చర్చించాలని చెప్పుకొచ్చారు. ప్రేమ, పెళ్లి విషయాల గురించి ఇంట్లో ఎప్పుడూ షణ్ణు డిస్కస్ చేయలేదని ఉమారాణి వెల్లడించారు.

షణ్ముఖ్, దీప్తి నిజంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటే... షణ్ణు ఇంట్లో గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక దీప్తి ఇంట్లోవాళ్ళు తమ అభిప్రాయం చెప్పడమే తరువాయి. వాళ్ళు కూడా ఓకే చెబుతారని ఇద్దరి అభిమానులు ఆశిస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.