English | Telugu

"ష‌ణ్ముఖ్‌, నేను విడిపోతున్నాం".. దీప్తి సంచ‌ల‌నం! కార‌ణం ఆమేనా?

సెన్సేష‌న‌ల్ యూట్యూబ‌ర్స్‌, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జ‌స్వంత్‌, దీప్తి సునైనా ఐదేళ్ల ప్రేమ‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసి, ఎవ‌రి దారి వారు చూసుకుంటున్నారు. అవును. ఈ విష‌యాన్ని కొత్త సంవ‌త్స‌రారంభంలో దీప్తి సునైనా స్వ‌యంగా త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్ల‌డించి సంచ‌ల‌నం సృష్టించింది. ఎవ‌రి జీవితాల‌ను వారు బ‌త‌కాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ఆ పోస్ట్‌లో ఆమె తెలిపింది. తాము క‌లిసి ఉండ‌టానికి పోరాటం చేస్తూనే, త‌మ‌కు నిజంగా ఏం కావాల‌నే దాన్ని విస్మ‌రిస్తూ వ‌చ్చామ‌ని దీప్తి చెప్పింది. త‌మ దారులు భిన్న‌మైన‌వ‌నీ, వాటిలో చిక్కుకోకుండా ముందుకు సాగాల‌ని గ్ర‌హించామ‌ని కూడా ఆమె రాసుకొచ్చింది.

త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన నోట్‌లో దీప్తి ఏం రాసుకొచ్చిందంటే..

"నా శ్రేయోభిలాషులు, స్నేహితులంద‌రికీ,
చాలా లోతుగా ఆలోచించిన మీద‌ట‌, ష‌ణ్ముఖ్‌, నేను ప‌ర‌స్ప‌రం మా వ్య‌క్తిగ‌త జీవితంలో ముందుకు సాగాల‌ని, ఎవ‌రి సొంత వ్య‌క్తిగ‌త మార్గాల‌ను అనుస‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నాం. గ‌త 5 సంవ‌త్స‌రాలు మా ఇద్ద‌రికీ ఆనందాన్నీ, ఆప్యాయ‌త‌నీ, ఎదుగుద‌ల‌నీ అందించ‌డ‌మే కాదు, మా భూతాల‌తో వ్య‌వ‌హ‌రించ‌డం చాలా క‌ష్ట‌మైంది.
మీరందరూ కోరుకున్నట్లే ఇది కొనసాగాలని మేమిద్దరం కోరుకున్నాం. కానీ ఇదిప్పుడు చాలా కాలంగా జరుగుతోంది. అతే కాదు, ఇది సోషల్ మీడియాలో కనిపించినంత తేలికైన స్వారీ కాదు. మేం కలిసి ఉండటానికి పోరాడుతూనే, జీవితంలో మాకు నిజంగా ఏం అవసరమనే దాన్ని విస్మరిస్తూ వ‌చ్చాం. మా దారులు భిన్నమైనవని, వాటిలో చిక్కుకోకుండా ముందుకు సాగాలని గ్రహించే స్థాయికి మేం చేరుకున్నాం.
మీ అందరి ప్రేమకు నేను బ‌ద్ధురాలిని. ఈ క్లిష్ట సమయాల్లో మాకు అండగా ఉండాల్సిందిగా, కొత్త దిగంతాల‌ వైపు మేం వెళ్తున్న‌ప్పుడు మాకు అవసరమైన ఏకాంతాన్ని క‌ల్పించ‌మ‌నీ, మద్దతును అందించమనీ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.
ధన్యవాదాలు
- దీప్తి సునైనా"

బిగ్ బాస్ 5 షోలో తోటి కంటెస్టెంట్ సిరి హ‌న్మంత్‌తో ష‌ణ్ముఖ్ అత్యంత స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రించ‌డం, ఇద్ద‌రూ త‌ర‌చూ కౌగిలింత‌లు, ముద్దుల‌తో వీక్ష‌కుల‌ను షాక్‌కు గురిచేయ‌డం తెలిసిందే. ఇద్ద‌రూ నిజ జీవితంలో వేరే వ్య‌క్తుల‌తో ల‌వ్‌లో ఉన్న‌ప్ప‌టికీ, హౌస్‌లో ల‌వ‌ర్స్ లాగా బిహేవ్ చేయ‌డం టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. అయిన‌ప్ప‌టికీ ష‌ణ్ముఖ్ గేమ్‌లో భాగంగానే అలా న‌డ‌చుకుంటున్నాడంటూ అత‌డిని స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చింది దీప్తి. కానీ ఇప్పుడు బిగ్ బాస్ షో ముగిసి, ష‌ణ్ముఖ్ బ‌య‌ట‌కు వ‌చ్చిన కొద్ది రోజుల‌కే దీప్తి నుంచి ఇలాంటి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న రావ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. సిరితో ష‌ణ్ముఖ్ స‌న్నిహితంగా మెల‌గ‌డం గేమ్‌లో భాగమా, లేక నిజంగానే ఇద్ద‌రూ క్లోజ్ అయ్యారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.