English | Telugu

సిగ్గుండాలి మనకు! ఎంబీఏ ఫైనాన్స్ ఎందుకు?

'సిగ్గుండాలి మనకు! ఎంబీఏ ఫైనాన్స్ ఎందుకు?' అని 'ఎవరు మీలో కోటీశ్వరుడు' కార్యక్రమంలో హాట్ సీటులో కూర్చున్న కంటెస్టెంట్‌తో హోస్ట్ సీట్‌లో కూర్చున్న జూనియ‌ర్‌ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. అందుకో కారణం ఉంది. అదేమిటంటే... ఓ ప్రశ్నకు కంటెస్టెంట్‌కే కాదు, తారక్‌కు కూడా ఆన్సర్ తెలియలేదు.

అయితే, హాట్ సీటులో కూర్చున్న వ్య‌క్తి కుమార్తె కూడా ఆ షోకు వచ్చింది. ఆ చిన్నారికి ఆన్సర్ తెలిసింది. 'గుర్రం జాషువా' అని చెప్పింది. దాంతో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. మనకి సిగ్గుండాలని చెప్పారు. చిన్నారి స్కూల్ టీచర్ రాజ్యలక్ష్మిగారిని కూడా తార‌క్‌ అభినందించారు. అయితే, ఆ ప్రశ్న ఏంటనేది తెలియడానికి షో చూడాలి.

తార‌క్‌ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న సంగతి తెలిసిందే. 'ఎవరు మీలో కోటీశ్వరుడు'లో తనకు క్లాసికల్ డాన్స్ నేర్పించినది సుధాకర్ అని, ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియాలో ఉంటున్నారని చెప్పారు. ఈమధ్య పెద్దగా కలవలేదని తెలిపారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.