English | Telugu

సొంత అక్కే మోసం చేసిందన్న షకీలా

షకీలా అనే పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. శృంగార తారగా పేరుతెచ్చుకుంది. సౌత్ ఇండియా మొత్తానికి ఆమె పేరు సుపరిచితమే. 1990 s లో మలయాళ ఇండస్ట్రీని ఏలింది షకీలా. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది. ఈమె తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను చెప్పింది. తన ఆస్తి పోవడానికి కారణం కూడా చెప్పింది. మా అమ్మ అక్కను బాగా నమ్మేది నాకంటే ఎక్కువగా. నేను కూడా అక్కని ఎక్కువ నమ్మాను. కానీ నమ్మినందుకు అక్కే నన్ను మోసం చేసింది. మా అమ్మ తర్వాత అమ్మలా చూసుకున్నాను అక్కను. ఐతే నా దగ్గర సుమారు రెండు కోట్లకు పైనే డబ్బు తీసుకుంది.

ఇంట్లో పెడితే ఐటీ సమస్య వస్తుందని అమ్మకు చెప్పి నా డబ్బు తాను జాగ్రత్త చేస్తానని చెప్పి చివరికి మొత్తం తీసేసుకుంది. నేను వెళ్లి నా డబ్బు అడిగితే ఎవరికో ఇచ్చానని అతను మోసం చేసి పోయాడని చెప్పింది నాకు. ఏం చేయాలో నాకు అర్ధం కాలేదు. కష్టపడిందంతా అలా అక్క పాలయ్యింది. ఏ పని చేసినా అక్కకు చెప్పకుండా చేసే అలవాటు నాకు లేదు. బయటి వాళ్ళు మోసం చేస్తే కేసులు పెడతాం ఏమైనా చేస్తాం కానీ సొంత అక్క కదా ఏం చేయగలం అంటూ అలీతో సరదాగా షోలో కన్నీళ్లు పెట్టుకుంది షకీలా. ఇక ఇప్పుడు చెప్పుకోలేని విషయం ఏమిటంటే ఐదేళ్లుగా మా అక్క నాతో మాట్లాడ్డం మానేసింది. ఎందుకు మాట్లాడం లేదని అడిగాను. నువ్ సినీ ఆక్టర్ వి కదా. మా పిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయి..వాళ్ళ ఇళ్లల్లో నీతో మాట్లాడ్డానికి ఒప్పుకోవడం లేదని చెప్పింది. మనం గుడ్డిగా ఎవరిని నమ్ముతామో వాళ్ళు కూడా మనల్ని అలాగే మోసం చేస్తారు అని తెలిసొచ్చింది అంటూ షకీలా తన మనసులో బాధల్ని పంచుకుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.