English | Telugu

'భార్య అంటే ఎవ‌రు?' అంటూ నందూని ఇరికించిన యాంక‌ర్‌

నందు ఫ్యామిలీ, తులసి ఫామిలీ ఒక కాంటెస్ట్ కి వెళ్తారు. అక్కడ నందు, తులసి, అభి, దివ్య వీళ్లంతా ఆ పోటీలో విన్ అవుతారు. లాస్య ఈ హ్యాపీ మూమెంట్ ని చూసి కుళ్లిపోతూ ఉంటుంది. తర్వాత నందుకి యాంకర్ ఒక టిపికల్ క్వశ్చన్ వేస్తుంది, 'అసలు భార్య అంటే ఎవరు?' అని. నందు నీళ్లు నములుతూ ఉంటాడు. ఇంతలో నందు వాళ్ళ నాన్న మధ్యలో ఎంటరై 'గడ్డ కట్టే చలిలో కూడా చెమటలు పట్టించేదే భార్య' అంటూ ఫన్ క్రియేట్ చేస్తాడు. 'విన్నర్స్ అందరికి కశ్మీర్ వెళ్ళడానికి ఫ్లయిట్ టికెట్స్ ఫోన్ చేసి ఇస్తాం' అని చెప్తుంది యాంకర్. తులసిని వదిలేసి వెళ్లిన నందుని ఈ కాంటెస్ట్ తర్వాత లాస్య కూడా వదిలేసి వెళ్ళిపోతుంది.

మరో వైపు నందు బిజినెస్ కోసం డబ్బు అవసరం అని చెప్పకుండా అభి.. భార్య‌ను డబ్బు కావాలి అని అడుగుతాడు. అంకిత మిస్ అండ‌ర్‌స్టాండ్‌ చేసుకుంటుంది. ప్రేమ్ చేసే ఆల్బం కోసం డబ్బు అడుగుతున్నాడనుకుని ఐదు లక్షల చెక్ ఇస్తుంది. అది చూసి అభి కోపంతో రంకెలేస్తాడు, 'మా నాన్నకు మాటిచ్చాను బిజినెస్ చేసుకోవడానికి డబ్బు తెస్తాను' అని. 'అది నాకు సంబంధం లేదు' అంటుంది అంకిత.

ఇక తులసి చెప్పే సంగీతం క్లాసెస్ కి ఆ కాలనీ కన్వీనర్ చాలా మంది పిల్లల్ని తెచ్చి చేర్పిస్తుంది. అప్పుడు తులసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో అంకిత పెట్టె సర్దుకుని పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చేస్తుంది. తులసి రావద్దని చెప్పినా అంకిత ఎందుకు మళ్ళీ అత్తగారింటికి వచ్చిందో తెలియాలంటే ఈరోజు సాయంత్రం స్టార్ మాలో ప్రసారం అయ్యే 'గృహలక్ష్మి' సీరియల్ లో చూడొచ్చు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.