English | Telugu
హుస్సేన్ సాగర్ మధ్యలో ఏముంటుంది?.. అనసూయ ప్రశ్న
Updated : Jun 17, 2022
సుధీర్ లేకపోయినా, నాగబాబు, రోజా లేకపోయినా జబర్దస్త్ తన స్థాయిలో ఎలాంటి మార్పు లేకుండా ప్రతీ వారం ఎంతో కొంత కొత్తదనాన్ని తెలుగు ఆడియన్స్ కి అందిస్తూ ముందుకెళుతోంది. ఈ వారం జబర్దస్త్ ఎపిసోడ్ కి 'చోర్ బజార్' టీం వచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఐతే ఈ షోలో అనసూయ "జబర్దస్త్ స్కూల్" అనే ఒక స్కిట్ లో స్టూడెంట్స్ ని కొన్ని ప్రశ్నలు వేస్తుంది.
వాటిలో ఒకటి.. "అశోకుడు రోడ్లకిరువైపులా చెట్లు ఎందుకు నాటించాడు?".. 'చెల్లెలి కాపురం' సీరియల్ లో నటించిన భూమి అలియాస్ శిరీష ఈ స్కిట్ లో స్కూల్ స్టూడెంట్ గా కనిపిస్తుంది.. 'చెట్లు నాటకపోతే అవి పడిపోతాయి కదా అందుకే నాటాడు' అని చిలిపి జవాబు చెప్తుంది. "హుస్సేన్ సాగర్ మధ్యలో ఏముంటుంది అంటూ మళ్ళీ అడిగింది అనసూయ. 'కార్తీక దీపం' సీరియల్ లో హిమ కేరక్టర్ చేసిన సహృద ఆన్సర్ ఇస్తుంది. 'హుస్సేన్ సాగర్ మధ్యలో లోతుంటుంది'అని.
ఇక ఈ షో లో "మా దగ్గర అన్ని దొరుకుతాయి" అనే స్కిట్ లో నూకరాజు, చలాకీ చంటి పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. మంచి ఎంటర్టైన్ కూడా చేసింది. నూకరాజుని తన పేరేమిటని అడిగాడు చంటి. 'భూమి ఇడ్లీ' అంటాడు నూకరాజు. 'అదేం ఇడ్లీ?' అంటాడు చంటి ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తూ. 'ఆయన ఆకాష్ పూరి అని పెట్టుకుంటే తప్పులేదు కానీ నేను భూమి ఇడ్లీ పెట్టుకుంటే తప్పా' అంటూ మంచి టైమింగ్ వున్న రైమింగ్ తో ఫన్ క్రియేట్ చేశాడు నూకరాజు. ఇక ఈ స్కిట్స్ అన్ని వచ్చే వారం ప్రసారం కాబోతున్నాయి.