English | Telugu

ఎక్కువ రోజులు బతకాలంటే ఎం చేయాలో తెలుసా

జ్యోతి రెడ్డి బుల్లితెర నటి.. ఈమె గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు. ఎండమావులు, కార్తీక దీపం, ప్రేమ ఎంత మధురం, రాధకు నీవేరా ప్రాణం ఇలా ఎన్నో హిట్ సీరియల్స్‌లో నటించింది జ్యోతి రెడ్డి. కార్తీకదీపంలో ఏసీపీ రోషిణిగా, ఎండమావులు సీరియల్‌లో విలన్‌గా ఆమె చేసిన పాత్రలకి చాలా మంచి పేరు వచ్చింది. 'ప్రేమ ఎంత మధురం'లో అమ్మవారి గెటప్‌లో ఆమె చేసిన నాట్యం ఇప్పటికీ ఆడియన్స్ కళ్ళ ముందు మెదులుతోంది.

అలాంటి జ్యోతిరెడ్డి చెప్పే లైఫ్ టిప్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. అలాంటి ఒక లైఫ్ టిప్ చెప్పింది చెప్పింది జ్యోతి. "తక్కువగా భోజనం చేసి, తక్కువగా వ్యాయామం చేస్తూ, తక్కువగా ఆయాసపడుతూ, తక్కువగా ఫ్రెండ్ షిప్ మెయింటైన్ చేస్తూ, తక్కువగా మాట్లాడ్డడం నేర్చుకుంటే ఎక్కువ రోజులు సంతోషంగా బతికేయొచ్చు" అని చెప్పింది. ఇందులో ఎంతో నిజం ఉంది కదా. ఆశ లేకుండా ఉంటే ఏ బాధా లేదు. ఎక్కువ మాట్లాడకపోతే గొడవలే రావు కదా.. ఇక జ్యోతి రెడ్డి చెప్పిన ఈ లైఫ్ టిప్ కి నెటిజన్స్ కూడా బాగా రియాక్ట్ అవుతున్నారు. నిజమే మీరు చెప్పింది. థ్యాంక్యూ...అద్భుతమైన మాట, జీవితానికి ఉపయోగపడే మాట ..గుడ్ మెసేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నో స్టేజ్ షోస్ ఇచ్చిన జ్యోతి రెడ్డి తల్లి ఎంకరేజ్ మెంట్ తో బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చి దాదాపు 33ఏళ్ళు అవుతోంది. ఈమె తెలుగు, తమిళ సీరియల్స్ లో నటించింది. అలాగే 2వేలకు పైగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఎన్నో పురస్కారాలు అందుకున్న ఈమెకు పేరు తెచ్చిన సీరియల్స్ రక్తసంబంధం, ప్రేమ ఎంత మధురం. ఇక ఇప్పుడు ఈమె మోటివేషనల్ వీడియోస్ తో అందరినీ ఆకట్టుకుంటోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.