English | Telugu

Bigg Boss 9 Telugu Nominations: భరణి ఛాలెంజ్...సంజన ఫైర్...కూర్చొని తినడానికి రాలేదు

బిగ్ బాస్ సీజన్-9 లో నిన్నటితో నామినేషన్ ల పర్వం ముగిసింది. కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ముఖ్యంగా కలిసి ఉన్న వాళ్ల మధ్య పెద్ద గొడవ జరగింది. అది బిబి ఆడియన్స్ నిజంగా షాకింగ్ విషయమే. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం.

నిన్నటి నామినేషన్లో మొదటగా రీతూ నామినేషన్ చేయగా ఆ తర్వాత సంజనకి అవకాశం దక్కింది. గౌరవ్ బాల్ సంపాదించి సంజనకి ఇచ్చాడు. ఇక సంజన రాముని ఫస్ట్ నామినేట్ చేసింది. రాము నీకు ఏం అనిపించలేదా అక్కడ బెడ్ టాస్కులో ఒక్క అమ్మాయిని నలుగురు అబ్బాయిలు అలా ఎత్తుకొని తీసుకుపోయారు.. రూల్ మార్చేద్దామని.. అలానే నన్ను ఇంట్లో పడుకోనివ్వలేదు.. ఓపెన్‌గా భరణికి సపోర్ట్ చేశావ్ సంఛాలక్‌గా.. లిట్రల్లీ వాళ్లు గుండాల్లా వచ్చేసి అమ్మాయిల్ని తీసి ఇట్లా పడేస్తున్నారు.. మీరేం చేస్తున్నారు సంఛాలక్‌గా.. అంటూ సంజన ఫైర్ అయింది. దీనికి రాము కూడా స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకున్నాడు. మీరు గేమ్ ఆడటానికి ఇక్కడికి వచ్చారంటేనే మీకు అది తెలుసుండాలి.. ఇక్కడ జెండర్ బయాస్ ఏం లేదు.. అందరు కలిసే ఆడాలి.. అక్కడ నా అక్కున్నా నా చెల్లి ఉన్నా నేను అలానే చేస్తాను.. నేను ఇక్కడ కూర్చొని తినడానికి రాలేదు. నేను గేమ్ ఆడుతున్నాను. అన్నీ చూస్తున్నానంటూ రాము బదులిచ్చాడు.

ఆ తర్వాత భరణిని నామినేట్ చేసింది సంజన. నాకు బాలేనప్పుడు నన్ను హౌస్‌లోకి రాకుండా రాముతో మీరే చెప్పి అలా చేయించారు.. అది నాకు నచ్చలేదంటూ సంజన చెప్పింది. మీ కోసం బాక్స్ త్యాగం చేసింది నేను.. అలాంటిది బెడ్ టాస్క్‌లో గేమ్ ఆడితే మీరు గూండాలు అని ఎలా అంటారు.. ఆ మాట వెనక్కి తీసుకోండి.. మరి ఇప్పుడు వైల్డ్‌కార్డ్స్‌లో వాళ్లు అమ్మాయిలు కాదా.. వాళ్లు పోటీపడలేదా.. గూండాలు అనకూడదంటూ భరణి ఫుల్ ఫైర్ అయ్యాడు. ఒకవేళ నేను రాముతో మీ పేరు చెప్పి మిమ్మల్ని లోనికి రాకుండా అడ్డుకున్నానని ప్రూ చేస్తే నేనే హౌస్ నుంచి వాకౌట్ చేస్తానంటూ భరణి ఛాలెంజ్ చేశాడు. ఇక భరణి మాట్లాడుతుండగా మధ్యలో సంజన మాట్లాడుతుంటే.. వినండి.. ముందు విను.. మీ గురించి చూసి చూసి మెంటల్‌గా అలసిపోయి మాట్లాడుతున్నా.. మా త్యాగాల వల్ల మీరు ఇక్కడున్నారు.. అది మర్చిపోకు.. ఆడియన్స్ కూడా సంజనని భరణిని చూస్తున్నారు.. ఎవరు ఏంటో వాళ్లకి తెలుసు. అంటూ భరణి ఫైర్ అయ్యాడు. ఇక రాము-భరణిలో రాముని సేవ్ చేసి భరణిని నామినేట్ చేశాడు గౌరవ్. సంజన చేసిన ఈ రెండు నామినేషన్లు మీకెలా అనిపించాయో కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.