Read more!

English | Telugu

మీ తాతయ్య తనని కన్నకూతురిలా చూసుకున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -48 లో.. రాజ్ పెళ్ళి తనతో జరగడానికి కారణం రుద్రాణీనే అని కావ్య చెప్తుంది. "నా గురించి ఇంట్లో అందరికి చెప్తావా నిన్ను వదిలిపెట్టను కావ్య" అని రుద్రాణి తన మనసులో అనుకుంటుంది. తను లోపలికి వెళ్ళిపోతుంటే.. "ఆగు రుద్రాణి" అని అపర్ణ అంటుంది. ఇక్కడ నుండి అందరూ లోపలికి వెళ్ళండని చెప్తుంది. అపర్ణ అక్కడే ఉంటుంది. పిల్లలందరూ లోపలికి వెళ్తారు. రాజ్ వెళ్తుండగా.. "రాజ్ నువ్వు ఇక్కడే ఉండు. నీకు పెళ్ళి అయింది. నిజాలు నువ్వు తెలుసుకోవాలి" అని అపర్ణ అంటుంది. ఇందంతా ఎందుకు చేసావ్ రుద్రాణి అని కోప్పడుతుంది. "చెప్పాను కదా ఈ ఇంటి పరువు కోసం" అని రుద్రాణి అంటుంది. నీకేం అధికారం ఉందని నా కొడుకు జీవితంతో ఆడుకున్నావ్ అని రుద్రాణి చెంప చెళ్ళుమనిపిస్తుంది అపర్ణ. రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

"ఇన్ని రోజులు మీ తాతయ్య మంచితనంతో ఈ ఇంటికి ఆడపడుచులాగా చలామణి అవుతున్న ఈ రుద్రాణి అసలు ఈ ఇంటికి ఏమీ కాదు. మన రక్తం కాదు. వీళ్ళ నాన్న ఈ ఇంట్లో మేనేజర్ గా ఉండేవాడు. తను చనిపోతూ నా కూతురుని బాగా చూసుకోమని మీ తాతయ్య చేతిలో పెట్టాడు. అప్పటినుండి మీ తాతయ్య తనని కూతురిలా చూసుకున్నాడు" అని రాజ్ తో అసలు నిజాన్ని చెప్పేస్తుంది అపర్ణ. మా నాన్న మీ కుటుంబం కోసం చాలా చేసాడని రుద్రాణి అనగానే.. "ఏం చేసాడు మేనేజర్ గా మాత్రమే ఉద్యోగం చేశాడు" అని రాజ్ వాళ్ళ నానమ్మ అంటుంది. ఇదంతా రుద్రాణి కూతురు చాటుగా వింటుంది. రాజ్ మాత్రం సైలెంట్ గా ఉండిపోతాడు. ఇదంతా పక్కన పెట్టి ఈ రోజు రిసెప్షన్ గురించి ఆలోచించండని దాన్యలక్ష్మి అంటుంది. ఇక రాజ్ నానమ్మ కావ్య దగ్గరికి వెళ్ళి.. ఈరోజు ఈ నగలు వేసుకోమని చెప్తుంది. ఇంతలోనే రాజ్ వచ్చి "నేను ఇస్తాను.. నువ్వు వెళ్ళు నానమ్మ" అంటాడు. ఈ నగలు వేసుకో అని రాజ్ అనగానే‌.. నువ్వు నన్ను భార్యగా అంగీకరిస్తేనే వేసుకుంటానని కావ్య అంటుంది. అలా అనగానే రాజ్ కి కోపమొచ్చి నగలు విసిరేస్తాడు. అవి కావ్య మెడలో పడతాయి.. ఇంతలో రాజ్ నానమ్మ వచ్చి కొన్ని నగలు తీసుకొచ్చి ఇవి కూడా వేసుకో అని అంటుంది.

మరోవైపు కనకం వాళ్ళ ఇంటికెళ్ళి.. దుగ్గిరాల వారి ఇంట్లో కావ్య సంతోషంగా ఉందని అబద్ధం చెప్తుంది. అలా కనకం చెప్పినా అప్పు, కృష్ణమూర్తి ఎవరు నమ్మరు. మరోవైపు రాహుల్ ఇంకా రావట్లేదని స్వప్న తన గురించి ఆలోచిస్తూ.. "నిజం తెలిసి కూడా నా ముందు తెలియనట్లు ఉన్నాడా" అని భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.