English | Telugu

వైల్డ్  లేడీగా రోహిణి ఎంట్రీ.. మేము ఉన్నామంటూ మాటిచ్చిన జ్యోతక్క!


రౌడీ రోహిణి.. సీజన్-3లో ఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-8 లోకి ఎంట్రీ ఇచ్చి.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. రోహిణి బిగ్ బాస్ కి ముందు అసలు ఎవరనేది చాలా మందికి తెలియదు కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా షోస్ కి యాంకర్ గా, సినిమా ప్రమోషన్ లు అంటూ చాలా పాపులర్ అయింది. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో కామెడీతో మంచి పేరు తెచ్చుకుంది. అదే విషయం నాగార్జున తో కూడా స్టేజ్ మీద చెప్పేసింది.

బిగ్ బాస్ తర్వాతనే నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. ఎవరి దిష్టి తగిలిందో ఏమో గాని నాకు ఆక్సిడెంట్ అయింది. కాలుకి దెబ్బ తాకింది. మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్.. తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా అయ్యానని తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్పుకొచ్చింది. రోహిణి ఎప్పుడు చలాకీతనంతో కమెడి క్రియేట్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ లో కూడా తనదైనా స్టైల్ లో కామెడీ చేస్తుంది. అయితే రోహిణికి నాగార్జున సర్ ప్రైజ్ అంటు.. జ్యోతక్క అలియాస్ తీన్మార్ సావిత్రి మాట్లాడిన ఒక వీడియోని చూపించాడు.

ఆ వీడియోలో ఏం ఉందంటే.. రోహిణి నువ్వు చాలా బాగా ఎంటర్‌టైన్మెంట్ అందిస్తావ్. నువ్వు బాగా ఆడాలని కోరుకుంటున్నాను.. నువ్వు బయట గురించి ఆలోచించకు.. అంతా మేమ్ చూసుకుంటాం.. నీ ఎంటర్‌టైన్మెంట్ కోసం బయట వెయిట్ చేస్తున్నామని రోహిణికి శివజ్యోతి బూస్టప్ ఇచ్చింది. ఇక హౌస్ లోకి వెళ్ళి అందరితో ఫ్రాంక్ చెయ్యాలని చెప్తాడు. రోహిణి లోపలికి వెళ్లి.. నేను కంటెస్టెంట్ గా రాలేదు.. గెస్ట్ గా వచ్చాను.. నన్ను ముట్టుకుంటే డైరెక్ట్ నామినేట్ అవుతారని అంటుంది. అందులో కొంతమంది నిజం అనుకుంటారు కూడా.. కొంతమంది ఫ్రాంక్ అనుకుంటారు. ఆ తర్వాత రోహిణి ఫ్రాంక్ అని చెప్పి అందరితో మాట్లాడుతుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.