English | Telugu

పాట‌ల‌తో ర‌ష్మీ క‌వ్వింపు.. నేను ఆగ‌లేన‌న్న సుధీర్‌

బుల్లితెర పై సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్ ల జంట‌కున్న పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. వీరి కాంబినేష‌న్ లో ఏ స్కిట్ చేసినా అది సూప‌ర్ హిట్టే. వీరిద్ద‌రు గ‌త కొంత కాలంగా `ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్` కామెడీ షోలో ఎంట‌ర్ టైన్ చేస్తున్నారు. ఇటీవ‌ల స్టార్ మా ఉగాది సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా ప్లాన్ చేసిన షోలో ఈ ఇద్ద‌రు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. షో మ‌ధ్య‌లో స్పెష‌ల్ గా ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్ పాట‌లు పాడుతూ ర‌ష్మీగౌత‌మ్ పై త‌న‌కున్న ప్రేమ‌ని వ్య‌క్తం చేసే ప్ర‌య‌త్నం చేశాడు.

తాజాగా `ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్` ఎపిసోడ్ లో అవే పాట‌ల్ని ర‌ష్మీ పాడుతూ సుధీర్‌ని ఇబ్బందిపెట్టే ప్ర‌య‌త్నం చేసింది. కెవ్వుకేక రాకేష్ తో క‌లిసి తొలిసారి సుడిగాలి సుధీర్ ఓ స్కిట్ చేశాడు. తాత‌ల‌నాటి ప‌దివేల కోట్ల ఆస్తిని అమ్మాయిల పిచ్చితో రెండు వేల కోట్ల‌కు తీసుకొచ్చాడ‌ని, ఆ రెండే వేల కోట్లు ఇవ్వాలంటే సుడిగాలి సుధీర్ 24 గంట‌ల‌పాటు అమ్మాయిలని చూడ‌కూడ‌ద‌ని కండీష‌న్ పెడ‌తాడు కెవ్వుకేక కార్తీక్‌. దీంతో సుధీర్ ని డిస్ట్ర‌బ్ చేయ‌డానికి ర‌ష్మీ గౌత‌మ్ రంగంలోకి దిగేసింది.

సుధీర్‌ని కొంటె చూపులు చూస్తూ.. వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ ర‌ష్మీ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. అంతే కాకుండా `స్టార్ మా` షోలో త‌న కోసం సుధీర్ పాడిన పాట‌ల్ని పాడుతూ సుధీర్ ని ఉక్కిరిబిక్కిరి చేయ‌డం మొద‌లుపెట్టింది. దీంతో సుధీర్ త‌న‌ని తాను కంట్రోల్ చేసుకోలేక‌పోయాడు. నేను ఆగ‌లేను.. ర‌ష్మిని చూసేస్తా.. అంటూ ఓపెన్ అయిపోయాడు. అయితే కెవ్వుకేక కార్తీక్ .. సుధీర్ ని ఆపే ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో ర‌ష్మీతో పాటు రోజా కూడా సుధీర్‌ని ఆడుకోవ‌డం మొద‌లుపెట్టింది. సుధీర్ .. త‌న‌ కోసం చెప్పిన డైలాగ్ ల‌ని ర‌ష్మీ చెబుతూ త‌డ‌బ‌డింది. దీంతో `డైలాగ్ ని చంపేస్తున్నార‌మ్మా` అని సుధీర్ అన‌డంతో ఒక్క‌సారిగా అక్క‌డ‌ న‌వ్వులు విరిశాయి. ఏప్రిల్ 15న ప్ర‌సారం కానున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.