English | Telugu

రష్మీ నోట 'మెరిసింది మేఘం'... ఆశ్చర్యంలో ప్రేక్షకలోకం!

రష్మీ గౌతమ్ యాంకరింగ్ మొదలుపెట్టి ఎనిమిదేళ్లు దాటుతోంది. అయినా తెలుగులో డైలాగులు చెప్పడానికి ఆమె తడబడుతూ ఉంటుంది. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్... హైపర్ ఆది స్కిట్‌లో పెళ్లి కుమార్తె గెటప్ వేసింది చెప్పుకోవచ్చు. 'సుధీర్.. బుల్లితెరలో దూసుకువెళ్ళే నన్ను' అని డైలాగ్ చెప్పాలి. అందులో బుల్లితెరను బల్లితెర చేసేసింది. 'అమ్మా నీకు దణ్ణం పెడతా. అది బల్లితెర కాదు. బుల్లితెర' అన్నాడు ఆది. అప్పుడు 'నన్ను ఇక్కడికి పిలిచి కించపరుస్తారా?' అనబోయి 'కిందపరుస్తున్నారు' అన్నది రష్మీ. చెప్పుకొంటూ వెళితే తెలుగు డైలాగులకు రష్మీ తెగులు పట్టించిన సందర్భాలు చాలా ఉంటాయి. అటువంటి రష్మీ ఇప్పుడు ఏకంగా తెలుగులో పాట పాడి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆషాడం సందర్భంగా 'జీ తెలుగు' ఛానల్ 'ఆషాడంలో అత్తాకోడళ్లు' అని ఒక ఈవెంట్ చేసింది. అందులో సంగీత, రష్మీ గౌతమ్ సందడి చేయనున్నారు. ఇద్దరూ పాటలకు స్టెప్పులు వేశారు. అంతే కాదు, రష్మీ ఓ అడుగు ముందుకు వేసి 'మెరిసింది మేఘం...' సాంగ్ పాడింది. లేటెస్ట్ గా రిలీజైన ఈ ప్రోమో చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. సంగీత అయితే 'అబ్బబబ్బబా... ఇలాంటి మంచి సింగింగ్ నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్' అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ప్రోమో కింద కామెంట్స్ అయితే చాలా వచ్చాయి. రష్మీ సింగింగ్ బావుందని కొందరు, చాలాబాగా పాడిందని ఇంకొందరు ప్రశంసించారు. ఈవెంట్ టెలికాస్ట్ అయితే ఫుల్ సాంగ్ ఎలా పాడిందో వినొచ్చు, చూడొచ్చు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.