English | Telugu

ఓటింగ్ లో ప్రేరణ ప్రభంజనం.. లీస్ట్ లో ఎవరున్నారంటే!

బిగ్‌బాస్ హౌస్ నుంచి 7వ వారం మణికంఠ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో అంటూ ఆడియన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వేళ సోషల్ మీడియాలో బిగ్‌బాస్ అన్‌ అఫిషియల్ ఓటింగ్ రిజల్ట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్ని ఓటింగ్స్ చూసినా దాదాపు అన్నింట్లోనూ ప్రేరణ టాప్ ప్లేస్‌లో ఉంది.

బిగ్ బాస్ సీజన్-8 లో ఇప్పటికే ఇప్పటికే బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా, ఆదిత్య ఓం, నైనిక, సీత, మణికంఠ.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, పృథ్వీ, నయని పావని నామినేషన్లో ఉన్నారు. అయితే ఓటింగ్ లో ప్రేరణ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో నిఖిల్ ఉన్నాడు. ప్రేరణకి 25 శాతం ఓటింగ్ పడగా.. నిఖిల్ కి 19 శాతం ఓటింగ్‌ పడుతోంది. సాధారణంగానే నిఖిల్‌కి స్ట్రాంగ్ ఓట్ బేస్ ఉంది. కానీ ప్రేరణ నామినేషన్లు ఫుల్ ఫైర్ అయ్యింది. అది తనకి భారీగా ఓటింగ్ పడేలా చేస్తోంది.

ఇక వైల్డా కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ కూడా సేఫ్ జోన్‌లోనే ఉన్నాడు. 16 శాతానికి పైగా ఓటింగ్‌తో మెహబూబ్ నిలిచాడు. ఎప్పుడూ టాప్-3లో ఉండే విష్ణుప్రియకి ఈసారి ఆడియన్స్ భారీ షాక్ ఇస్తున్నారు. ఎంతలా అంటే ప్రస్తుతం సాగుతోన్న ఓటింగ్‌లో విష్ణుప్రియ అందరికంటే లీస్ట్‌లో ఉంది. దీనికి చాలానే కారణాలు ఉన్నాయనుకోండి. ముఖ్యంగా పృథ్వీపై పెట్టే కాన్సట్రేషన్ గేమ్‌పై పెట్టడం లేదు విష్ణు. దీంతో ఈ వారం విష్ణుకి నామినేషన్స్ కూడా అదే రీజన్‌పై పడ్డాయి. ఇదే ఓటింగ్ కొనసాగితే మాత్రం విష్ణుప్రియ ఎలిమినేషన్ కన్ఫమ్. ఇక విష్ణుప్రియతో పాటు నయని పావని, పృథ్వీలకి ఓటింగ్ లేదు. వీరు ముగ్గురు ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.