English | Telugu

Illu illalu pillalu : భార్యతో ప్రేమగా ఉన్న ధీరజ్.. అమూల్య విషయం చందు చెప్తాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -343 లో.. సాగర్ డ్రింక్ చేసి నర్మద దగ్గరకు వస్తాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావని పొగుడుతాడు.. ఏంటి డ్రింక్ చేసావా అని నర్మద అడుగుతుంది. మరొకవైపు ధీరజ్ డ్రింక్ చేసి ప్రేమ గదిలోకి వెళ్తాడు. అక్కడ ప్రేమ డ్రెస్ ఉండడంతో ప్రేమ డ్రెస్ చూస్తూ మాట్లాడుతాడు. అప్పుడే ప్రేమ వస్తుంది. ప్రేమని చూస్తూ పొగుడుతాడు. నీ కళ్ళు బాగున్నాయి.. నీ పెదాలు బాగున్నాయని ధీరజ్ అంటాడు.

ప్రేమ బుగ్గపై ముద్దుపెడతాడు. దాంతో ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రెండు జంటలు బాగా ఎంజాయ్ చేస్తున్నాయి.. నేను మాత్రమే ఈ బట్టలు పిండేస్తున్నానని శ్రీవల్లి అనుకుంటుంది. మరొకవైపు విశ్వతో అమూల్య ఫోన్ మాట్లాడుతుంది. తిరుపతి తన డ్రీం లో వచ్చిన అమ్మాయితో కలలు కంటుంటాడు. చందు దగ్గరికి శ్రీవల్లి వెళ్లి రొమాంటిక్ గా తన భుజంపై చెయ్ వేస్తుంది. అమూల్య గురించి తలుచుకుంటే భయంగా ఉందని చందు అనగానే.. శ్రీవల్లి పక్కకి వచ్చి తనని తనే తిట్టుకుంటుంది. ఛీ అసలు ముద్దు లేదు.. ముచ్చట లేదని అనుకుంటుంది.

మరుసటిరోజు ఉదయం చందు డల్ గా కూర్చొని ఉంటాడు. అప్పుడే విశ్వకి వినిపించేలా కాలేజీకీ వెళ్తున్నానని అమూల్య చెప్తుంది. అది చందు చూస్తాడు. లాభం లేదు ఇక నాన్నకి విషయం చెప్పాల్సిందేనని లోపలికి వెళ్లి నాన్న అని పిలుస్తాడు. వేదవతి వచ్చి ఏమైంది రా నిన్న కూడా ఏదో చెప్తానన్నావ్ ఏంటని అడుగుతుంది. ఏం లేదని చందు అంటాడు. బయటనుండి రామరాజు, తిరుపతి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.