English | Telugu

ఆర్య‌కు రాగ‌సుధ అడ్డంగా చిక్కిన‌ట్టేనా?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. మ‌రాఠీ సీరియ‌ల్ `తులా ఫ‌ఠేరే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. `బొమ్మ‌రిల్లు` ఫేమ్ వెంక‌ట్ శ్రీ‌రామ్ కీల‌క పాత్ర‌లో న‌టించి ఈ సీరియ‌ల్ ని నిర్మించారు. వ‌ర్ష హెచ్ కె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్‌, జ‌య‌లలిత‌, రామ్ జ‌గ‌న్‌, అనూష సంతోష్‌, రాధాకృష్ణ‌, క‌ర‌ణ్‌, ఉమాదేవి, సందీప్‌, జ్యోతిరెడ్డి, మ‌ధుశ్రీ న‌టించారు. కోరుకున్న వ్య‌క్తిని పొంద‌లేక అర్థాంత‌రంగా హ‌త్య‌కు గురైన ఓ ఆత్మ తిరిగి మ‌రో యువ‌తిగా అత‌న్ని కాపాడుకోవాల‌ని తాప‌త్ర‌య‌ప‌డే క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు.

గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. త‌న క‌ప‌ట బుద్ధితో రాజ‌నందినిని హ‌త్య‌ చేసిన రాగ‌సుధ ..అను అమాయ‌క‌త్వాన్ని అడ్డం పెట్టుకుని ఆర్య ఇంట్లో చేరి అత‌న్నే హ‌త్య చేయాల‌ని ప‌థ‌కం వేస్తుంది. వ‌శిష్ట‌ని సెల్లార్ లో పెట్టి ఆర్య వైద్యం చేయిస్తున్న విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన రాగ‌సుధ ఎలాగైనా ఆర్య‌ని మెడ‌పై నుంచి తోసేని హ‌త్య చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. ఇదే క్ర‌మంలో అనులోకి రాజ‌నందిని ప్ర‌వేశించి రాగ‌సుధ ప్ర‌య‌త్నాన్ని అడ్డుకోవ‌డ‌మే కాకుండా త‌న‌కు చుక్క‌లు చూపిస్తుంది.

చావు అంచుల దాకా తీసుకెళుతుంది. ఇదే స‌మ‌యంలో సెల్లార్ లో వున్న వ‌శిష్ట గ్యాస్ సిలిండ‌ర్ ని పేల్చి పారిపోవ‌డంతో అనుని ఆవ‌హించిన రాజ‌నందిని వెళ్లిపోతుంది. రాగ‌సుధ బ్ర‌తికి పోతుంది. ఇదే స‌మయంలో క‌ళ్ల‌కు క‌ట్టిన బ్లాక్ క్లాత్ కార‌ణంగా ఆర్య వ‌ర్థ‌న్ ఇబ్బ‌వందిప‌డ‌తాడు. అది అనుకి అందించింది రాగ‌సుధ అని తెలియ‌డంతో ఆర్య‌లో అనుమానం మొద‌ల‌వుతుంది. పేరు మార్చుకుని త‌మ మ‌ధ్యే తిరుగుతున్న లేడీ రాగ‌సుధ‌నే అని ఆర్యలో అనుమానం మొద‌ల‌వుతుంది. జెండే ఎంట్రీతో రాగ‌సుధ అడ్డంగా ఆర్య వ‌ర్థ‌న్ కు చిక్క‌బోతోందా? .. అస‌లు ఏం జ‌ర‌గ‌బోతోంది? అన్న‌ది తెలియాలంటే సోమ‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.