English | Telugu

ఓంకార్ దెబ్బ‌కు గుండెపోటు! కాళ్ల‌కు దండంపెట్టిన పోసాని!!

నటనలో, డైలాగ్ డెలివరీలో పోసాని కృష్ణమురళిది టిపికల్ స్టయిల్. ఆయనలా మరొకరు చేయలేరు. సినిమాల్లో ఆయన పెర్ఫార్మన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఈమధ్య టీవీల్లోనూ కనిపిస్తున్నారు. కొన్ని కామెడీ షోలకు గెస్టుగా వస్తున్నారు. వినోదం అందిస్తున్నారు. కమింగ్ వీకెండ్ 'సిక్త్స్ సెన్స్' ఎపిసోడ్‌కు వచ్చిన ఆయన తనదైన శైలిలో కామెడీ చేయనున్నారని ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది.

ఒకసారి 'సిక్త్స్ సెన్స్' హోస్ట్ ఓంకార్ కాళ్లు పట్టుకోవడానికి పోసాని వెళ్లారు. 'వన్ సెకండ్' అంటూ గేమ్ షోలో టెన్షన్ బిల్డ్ చేయడం ఓంకార్ స్టయిల్. అందుకు పోసాని వేసిన పంచ్ డైలాగులు, చేసిన పనులు నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. శివశంకర్ మాస్టారుతో 'నీకు ఆల్రెడీ ఒకసారి బైపాస్ జరిగింది. ఆయన దెబ్బకు నాకు బైపాస్ రెడీగా ఉంది' అని పోసాని అన్నారు. పోసాని డైలాగ్స్‌కు, చేష్ట‌ల‌కు ఓంకార్ సైతం తెగ న‌వ్వేశాడు.

'నాకు రెండోసారి వస్తుంది ఏమో అని డౌట్ గా ఉంది' అని శివశంకర్ అంటే... 'నీకు రెండోసారి రాదు ఇంక. అవుటే' అన్నారు. షో షూటింగ్ జరిగే దగ్గర అంబులెన్స్ రెడీగా ఉంటుందని పోసాని అంటే... 'అది కరెక్ట్' అని శివశంకర్ మాట కలిపారు. ఇప్పటివరకు షోకు వచ్చిన గెస్టులు ఒక ఎత్తు... పోసాని, శివశంకర్ కాంబినేషన్ మరో ఎత్తు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.