Read more!

English | Telugu

‘సుమ అడ్డా’లో అవసరాల శ్రీనివాస్‌ని తిట్టిన స్టూడెంట్!

ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి మూవీ మార్చి 17 న థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండేసరికి ప్రొమోషన్స్ ని స్టార్ట్ చేసింది ఈ మూవీ టీమ్. ఇందులో భాగంగా అవసరాల శ్రీనివాస్, కల్యాణి మాలిక్, మాళవికా నాయర్, సౌమ్య వీళ్లంతా "సుమ అడ్డా" షోకి వచ్చారు. వచ్చే వారం ప్రసారం కాబోయే ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  ఇక ఈ షోకి వచ్చిన ఒక లేడీ స్టూడెంట్ అవసరాల శ్రీనివాస్ ని ఇండైరెక్ట్ గా తిట్టేసింది.

సుమ షోకి ప్రతీ వారం కాలేజీ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఈ వారం కూడా అలాగే వచ్చిన  ఈ స్టూడెంట్స్ ని వెరైటీగా ఒక ప్రశ్న అడిగింది " సైకోల్లా బిహేవ్ చేసేది అబ్బాయిలా, అమ్మాయిలా" అనేసరికి "షాపింగ్ కి తీసుకెళ్లకపోతే అమ్మాయిలు ఎంత సైకోల్లా ప్రవర్తిస్తారు అంటే డివోర్స్ ఇచ్చేస్తారు" అని ఒక స్టూడెంట్ చెప్పాడు. "అలా డివోర్స్ లు ఇచ్చుకుంటూ పొతే చాలా కాపురాలు పోతాయి" అని కామెడీ చేసింది సుమ. "అబ్బాయిలు ఎంత సైకోగాళ్ళంటే వాళ్ళు పెంచుకునే జుట్టు, గడ్డం బట్టి చెప్పొచ్చు..అండమాన్ జైలు నుంచి పారిపోయి వచ్చిన ఖైదీల్లా ఉంటారు ఒక్కొక్కళ్ళు" అని మంచి ఫోర్స్ తో ఒక లేడీ స్టూడెంట్ తన అభిప్రాయాన్ని చెప్పేసరికి అవసరాల శ్రీనివాస్ సిగ్గు పడి నవ్వుకుంటూ తలా దించుకున్నాడు.

" నా పరువు పోయిందిగా..ఇంకా ఎలా తలెత్తుకుని తిరగ్గలను" అంటూ బ్యాక్ గ్రౌండ్ లో ఒక వాయిస్ వేశారు. సుమ కూడా పగలబడి నవ్వేసింది. "సుమ గారు నాకు ఒక రేజర్ ఉంటే ఇప్పించారు ప్లీజ్ అర్జెంటు గా" అని అవసరాల శ్రీనివాస్ ఫన్నీ అడగడం భలే నవ్వు తెప్పించింది. తర్వాత పాగల్ పవిత్ర వచ్చి అవసరాలతో కలిసి "ఆరడుగులుంటాడా" అనే సాంగ్ కి డాన్స్ చేసింది. అదే టైంకి పటాస్ ప్రవీణ్ అది చూసి "నువ్వు సెల్ సిగ్నల్ కోసం టవర్ కింద తిరిగినట్టుంది కానీ డాన్స్ చేస్తున్నట్టు లేదు" అన్నాడు ఫన్నీగా.