English | Telugu

ఆసియా అంటే చ‌చ్చేంత ఇష్టం అని బ‌య‌ట‌పెట్టిన నూక‌రాజు!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఎవ్రీ వీక్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో అలా సాగిపోతోంది. ఈ వారం ఎపిసోడ్ కూడా సరదా సరదాగా 'పెళ్ళాం చెబితే వినాలి' అనే కాన్సెప్ట్ తో సాగిపోయింది. అందరూ కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. చివరిలో ఆసియా, నూకరాజు పరువు హత్యల మీద ఒక స్కిట్ ప్లే చేశారు. వీళ్లిద్దరికీ తల్లితండ్రులుగా శాంతికుమార్ భార్యాభర్తలు నటించారు. వీళ్ళు పెర్ఫార్మ్ చేసిన విషాద ప్రేమ కథ అందరినీ కంటతడి పెట్టేలా చేసింది. శాంతికుమార్ కూడా ఒక తండ్రి విలన్ గా ఎలా మారతాడో చూపించాడు.

ఈ స్కిట్ గురించి రష్మీ మాట్లాడింది. "ఇలాంటి పరిస్థితిలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది డిసైడ్ చేయడం చాలా కష్టం" అని చెప్పింది. "మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం" అంది పూర్ణ. ఇక నూకరాజు ఆసియా గురించి తన ప్రేమను కాళ్ళు పట్టుకుని మరీ చెప్పాడు. ఆసియా అంటే తనకు పిచ్చి, ప్రాణం, ప్రేమ అని,"ఇప్పుడు పెళ్లి చేసుకోమన్నా చేసేసుకుంటాను" అన్నాడు. "నా కోసం తన కెరీర్ని కూడా వదిలేసుకుంది" అని చెప్పాడు నూకరాజు.

"ఈ షో చూసి మా ఇంట్లో వాళ్ళు అడిగితే ఆసియా అంటే చచ్చేంత ఇష్టం అని చెప్తాను" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆసియా కూడా "ఎప్పటికీ ఇలా కాళ్ళు పట్టుకునే రోజు కానీ, విడిపోయే రోజు కానీ రాకూడదు" అంటూ ఏడ్చేసింది. "ప్రేమించేటప్పుడు ఉన్న ధైర్యం పెద్దవాళ్లకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఉండాలి" అని నూకరాజుకి సలహా ఇచ్చింది ర‌ష్మీ. ఇలా ఈ వారం ఒక ఎమోషనల్ స్కిట్ తో పెళ్ళాం చెపితే వినాలి ఎపిసోడ్ కు ఎండ్ కార్డు పడింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.